ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం: 10 మంది కరోనా బాధితులు సజీవదహనం, పలువురి పరిస్థితి విషమం
ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయూలో భారీగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. మరి కొంతమంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో 17 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మంటలు చెలరేగిన క్రమంలో నర్సులు, వార్డు బాయ్స్, వైద్యులు.. రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. ఐసీయూలో మంటలు చెలరేగిన క్రమంలో ఆస్పత్రి మొత్తం పొగ కమ్మేసింది. తమ వారి పరిస్థితిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు.
A Fire broke out at a civil hospital ahemadnagar. 10 people died so far .heartbreaking 😓 #AhmednagarFire #ahmednagar pic.twitter.com/d6QHwkpS6o
— Aniket Dalvi (@AniketD65142582) November 6, 2021
అహ్మద్‌నగర్ ఆస్పత్రి ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతేగాక, ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు సీఎం ఉద్ధవ్.












Click it and Unblock the Notifications