మహారాష్ట్ర గ్రౌండ్ రిపోర్ట్- జరగబోయేదేంటీ?
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. అధికారంలో ఉన్న శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- భారతీయ భారతీయ జనతా పార్టీ- ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) దశలవారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే.

ఈ ఎన్నికల కోసం ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా.
ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ జన్‌మత్ పోల్.. తాను నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ వివరాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. 2019 తరహాలోనే ఏ పార్టీ లేదా కూటమికీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం దక్కబోదని తెలిపింది.

ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే బీజేపీ 82 నుంచి 84 నియోజకవర్గాలకు పరిమితమౌతుంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. 52 నుంచి 54 స్థానాలే దక్కించుకోగలుగుతుంది. ఎన్డీఏ లభించే సీట్ల సంఖ్య 129 నుంచి 133 వరకు ఉండొచ్చు. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా కాస్త ఫర్వాలేదనిపించుకుంది. ఈ కూటమికి 138 నుంచి 142 సీట్లు దక్కుతాయి. ఇతరులు 16 నుంచి 18 సీట్లల్లో గెలుస్తారని జన్‌మత్ పోల్స్ అంచనా వేసింది.
2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఈ సంఖ్యాబలాన్ని అందుకోలేదు. ఫలితంగా శివసేన- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది గానీ అది ఎంతో కాలం మనుగడ సాగించలేకపోయింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల దెబ్బకు కుప్పకూలింది. శివసేనలో చీలికను తీసుకుని రాగలిగింది. ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేయగలిగింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications