మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం..54 మందికి పాజిటివ్..మంత్రికి రెండోసారి వైరస్ ఎటాక్
మహారాష్ట్రలో ఒకవైపు కరోనా మరోవైపు ఒమిక్రాన్ కోరలు చాస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా మహ్మమారి విరుచుకుపడింది. డిసెంబరు 22న ప్రారంమైన ఈ సమావేశాలు కేవలం 5 రోజుల పాటే జరిగాయి. ఈ 5 రోజుల్లోనే 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడ్డవారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, సిబ్బంది ఉన్నారు.

అసెంబ్లీలో కరోనా.. మంత్రులతో పాటు 54 పాజిటివ్
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కూడా కరోనా వైరస్ వెంటాడింది. డిసెంబరు 22న ప్రారంభమైన ఈ సమావేశాలు 28వ తేదితో ముగిశాయి. ఈ ఐదు రోజుల్లోనే సుమారు 50 మందికి కరోనా సోకిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పావార్ తెలిపారు. వైరస్ బారిన పడ్డ వారిలో విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్, మరో మంత్రి కెసి పాడ్వి, బిజెపి ఎమ్మెల్యే సమీర్ మేఘేలు ఉన్నారు. వీరితో పాటు అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగులు, భద్రతా సిబ్బంది కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

మంత్రికి రెండో సారి కరోనా..
పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తనకు కరోనా సోకిందని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం తను ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. గతేదాది కూడా వర్ష గైక్వాడ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. సోమవారం వరకు ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

ప్రభుత్వం అప్రమత్తం.. కఠిన ఆంక్షలు
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న వారిలో దాదాపు 54 మందికి కరోనా సోకడంతో అథికారులు అప్రమత్తమైయ్యారు. పాజిటివ్‌గా నిర్థారణ అయిన వారిని హోం ఐసోలేషన్ ఉండాలని సూచించారు. వారితో కలిసిన వారిని ట్రేసింగ్ చేసి పరీక్షలు చేస్తున్నారు. అటు మహారాష్ట్ర వ్యాప్తంగా నిన్న ( మంగళవారం) ఒక్కరోజు 2వేలకు పైగా కరెనా కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 22 మంది మృతి చెందారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 167కి చేరింది. ఒకవైపు కరోనా వైరస్ మరోవైప కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. న్యూఇయర్ వేడుకలపై కూడా ఆంక్షలు విధించింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది.












Click it and Unblock the Notifications