• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలా ఓ తొమ్మిది: కూటమిలో చీలక రాకూడదుగా మరి: కొత్త మంత్రుల లిస్ట్ ఇదే

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కొత్త మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. శివసేన చీలికవర్గం-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కొత్తగా 18 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలుపుకొని మొత్తంగా కేబినెట్ సంఖ్య 20కి చేరింది. పోర్ట్‌ఫోలియోల కేటాయింపు కూడా ఇవ్వాళే పూర్తి కానుంది. సాయంత్రానికి మహారాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

కొత్తగా 18 మంది..

నిన్నటి వరకు మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి వేంద్ర ఫడ్నవిస్ ఇద్దరే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ వీరిద్దరే ఆయా శాఖల రోజువారీ సమీక్షలు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వస్తోన్నారు. ఇక తాజాగా మంత్రివర్గ విస్తరణకు పూనుకున్నారు. మంత్రివర్గంలోకి కొత్తగా 18 మందిని తీసుకున్నారు. ముంబై రాజ్‌భవన్‌లో కొద్దిసేపటి కిందటే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్త మంత్రులు వీరే..


బీజేపీ కోటా నుంచి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివర్, గిరీష్ మహాజన్, సురేష్ ఖడే, రాధాకృష్ణ వీఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిట్, అతుల్ సవేను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యాన్ని వహిస్తోన్న శివసేన చీలిక వర్గం నుంచి దాదా భుసె, శంభురాజె దేశాయ్, సాందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్, తానాజీ సామంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కెసర్కర్ గులాబ్‌ రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సహ్యాద్రి గెస్ట్‌హౌస్ టు..

ఈ కార్యక్రమానికి ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ హాజరయ్యారు. అంతకుముందు- ఏక్‌నాథ్ షిండే, శివసేన చీలిక వర్గానికి చెందిన శాసనసభ్యులందరూ ముంబై దక్షిణ ప్రాంతంలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని మర్యాదపూరకంగా కలిశారు. తమ రెండు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ఆయనకు అందజేశారు.

Recommended Video

ఆజాదీ సాయంతో మోడీ జమిలి ప్లాన్ *National | Telugu OneIndia

జాబితాపై..

ఈ జాబితాను రూపొందించడానికి ముందు ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ పలుదఫాలుగా చర్చలు జరిపారు. ఎవరెవరినీ మంత్రివర్గంలోకి తీసుకోవాలి? ఏ పార్టీ నుంచి ఎంతమందికి అవకాశం కల్పించాలనే విషయం మీద చర్చించారు. రెండు పార్టీల మధ్య సమతూకం ఉండేలా తొమ్మిది మంది చొప్పున శాసన సభ్యులకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లను కూడా కలుపుకొంటే బీజేపీ-శివసేన చీలికవర్గం నుంచి మొత్తంగా 10 మంది చొప్పున ఉన్నట్టయింది.

English summary
Maharashtra cabinet expansion: Each 9 leaders from BJP and Shiv Sena takes oath as ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X