బీజేపీ ఫాలోస్ తెలంగాణ కాంగ్రెస్: రైతు రుణమాఫీ, ప్రతి నెలా రూ.2,100

Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన నేపథ్యంలో రోడ్‌షోలు, బహిరంగ సభలతో హోరెత్తిపోతోంది మహారాష్ట్ర.

288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్‌ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తేలేది అప్పుడే.

Maharashtra election 2024 Amit Shah launches BJP s Manifesto

ఈ పరిస్థితుల మధ్య తాజాగా భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. మొత్తం 20 అంశాలను ఇందుల పొందుపరిచింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామని పేర్కొంది. సంక్షేమం- అభివృద్ధి ప్రాధాన్యతాంశాలుగా ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు కనిపించింది బీజేపీ.

సంకల్ప పత్ర్గా పేరు పెట్టిన ఈ మేనిఫెస్టోను కొద్దిసేపటి కిందటే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పియూష్ గోయెల్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, ముంబై సిటీ అధ్యక్షుడు ఆశీష్ షేల్కర్ విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే కీలక హామీలన్నింటినీ కార్యరూపంలోకి తీసుకొస్తామని అమిత్ షా ప్రకటించారు.

1. యువతకు 25 లక్షల ఉద్యోగాల కల్పన.
2. మహిళలకు ప్రతి నెలా 2,100 రూపాయల ఆర్థిక సహాయం
3. రైతు రుణమాఫీ. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పన.
4. వృద్ధాప్య పింఛన్ మొత్తం 1,500 నుంచి 2,100 రూపాయలకు పెంపు
5. యువత నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చడానికి స్కిల్ సెంటర్ ఏర్పాటు
6. ఆంగన్‌వాడి, ఆశా వర్కర్లకు ప్రతి నెలా 15,000 రూపాయల గౌరవ వేతనం, ఆరోగ్య బీమా కవరేజీ వర్తింపు
7. 10 లక్షల మంది విద్యార్థులకు ప్రతి నెలా ట్యూషన్ ఫీజుగా 10,000 రూపాయలు చెల్లింపు
8. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక యంత్రాంగం
9. దిగవ మధ్యతరగతి, మధ్య తరగతి, పేద కుటుంబీకుల విద్యుత్ బిల్లుల్లో రాయితీలు
10. 50 లక్షల మంది మహిళలను లక్షాధికారులు చేయడం.
11. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహారాష్ట్రను అగ్రగామిగా నిలపడం.
12. మేకిన్ మహారాష్ట్రగా గుర్తింపు
13. ఫిన్‌టెక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు మహారాష్ట్రకు వెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+