Gas leak: కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు: ఉలిక్కిపడ్డ జనం: ఉరుకులు పరుగులు
ముంబై: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు వెలువడిన తరహాలోనే మహారాష్ట్ర థానె జిల్లాలోని ఓ రసాయనిక పరిశ్రమల నుంచి గ్యాస్ లీక్ అయింది. కొన్ని గంటల పాటు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఘటు వాసన వారిని శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని కలిగించింది. గంటన్నర వ్యవధిలోనే గ్యాస్ లీకేజీని అరికట్టినప్పటికీ- దాని ప్రభావం కొన్ని గంటలపాటు కనిపించింది. పరిసర ప్రాంతాల ప్రజలు నిద్రలేని రాత్రిని గడపాల్సి వచ్చింది.
Aur bolo Khali sir pad ke ye kar do pad ke wo fad do.
— Yogi (@RealYogi_) June 3, 2021
Lagta hai Sahi mein pad dia unhone.😤😤
థానె జిల్లాలోని బద్లాపూర్ సమీపంలో గల ఆప్టేవాడి షిర్‌గావ్ పారిశ్రామికవాడలోని నోబెల్ ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి గ్యాస్ విడుదలైంది. రాత్రి 10:22 నిమిషాల సమయంలో గ్యాస్ వెలువడినట్లు థానె జిల్లా అధికారులు వెల్లడించారు. ఘాటు వాసనతో గ్యాస్ కూడుకుని ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రులకు పరుగులు తీశారు. వారంతా అందుబాటులో ఉన్న వాహనాలతో దూర ప్రాంతాలకు వెళ్లడం కనిపించింది.

గాలిలో కలిసిన సల్ఫ్యూరిక్ యాసిడ్, బెంజిల్ యాసిడ్ వల్ల పలువురు కళ్ల మంటలతో సతమతమయ్యారు. ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. పలువురికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు నెలకొన్నప్పటికీ.. దుర్వాసన ప్రభావం తగ్గిన తరువాత సాధారణ స్థితికి చేరుకున్నారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే థానె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హారాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు, అగ్నిమాపక సిబ్బంది నోబెల్ ఇంటర్మీడియట్స్ ఫ్యాక్టరీకి చేరుకున్నాయి.

Recommended Video
గ్యాస్ ఎక్కడి నుంచి వెలువడుతోందనే విషయాన్ని నిర్ధారించాయి. గంట తరువాత దాన్ని అరికట్టగలిగాయి. గ్యాస్ లీక్ ప్రభావం కొన్ని గంటల పాటు కొనసాగింది. దుర్వాసన తగ్గడానికి స్థానిక అధికారులు పలు ప్రాంతాల్లో నీళ్లను పిచికారి చేశారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని తెలిపారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలను అన్వేషిస్తున్నామని వివరించారు. నోబెల్ ఇంటర్మీడియట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులను జారీ చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications