వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ వికెట్: హోమ్ మంత్రి రాజీనామా: రూ.100 కోట్ల కలెక్షన్ ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో బిగ్ వికెట్ పడింది. మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అర్ధాంతరంగా తప్పుకొన్నారు. పదవి నుంచి వైదొలగారు. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు పంపించారు. ప్రతినెలా వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాలంటూ ముంబై పోలీసులను ఆదేశించారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటోన్నారు. దీనిపై దర్యాప్తు ఆరంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన పదవి నుంచి తప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. దానికి అనుగుణంగా అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.

ఇదివరకు ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన పరమ్‌బీర్ సింగ్‌ను బదిలీ చేయడం పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీసింది. విమర్శలకు కేంద్రబిందువైంది. ఆయనను ఉన్నపళంగా హోమ్ గార్డుల విభాగం డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. తనను అకారణంగా బదిలీ చేయడాన్ని పరమ్‌బీర్ సింగ్ న్యాయస్థానంలో సవాల్ చేశారు. ప్రతినెలా 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయాలంటూ తనను ఆదేశించారంటూ ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. ఈ లేఖ మహారాష్ట్ర రాజకీయాలను అల్లకల్లోలానికి గురి చేసింది. తాజాగా- అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామాకు దారి తీసింది.

Maharashtra Home Minister Anil Deshmukh submits resignation

అనిల్ దేశ్‌ముఖ్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో నెంబర్ టూగా వెలుగొందుతున్నారు. పదవుల పంపకాల్లో భాగంగా ఆయనకు కీలకమైన హోం మంత్రిత్వ శాఖ లభించింది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్సీపీ తరఫున నాగ్‌పూర్ జిల్లాలోని కటోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ స్థానం నుంచి అయిదుసార్లు ఆయన విజయం సాధించారు. మహావికాస్ అగాఢీ సర్కార్‌లో కీలకమైన హోం మంత్రి శాఖను దక్కించుకున్నారు. పరమ్‌బీర్ సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది.

English summary
Maharashtra Home Minister Anil Deshmukh submits resignation to Chief Minister Uddhav Thackeray.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X