దారుణం.. హెచ్ఐవి సోకిన బాలికపై రెండేళ్లు అత్యాచారం!
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లాతూర్‌లోని 'సేవాలయ హెచ్ఐవి బాధితుల షెల్టర్'లో ఆశ్రయం పొందుతున్న 16 ఏళ్ల హెచ్ఐవి పాజిటివ్ బాలికపై రెండేళ్ల నుంచి పదేపదే అత్యాచారం జరిగిందని, అంతేకాకుండా ఆమెను బలవంతంగా గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై లాతూర్ పోలీసులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు. ఈ దారుణమైన విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించినందుకు సేవాగృహం వ్యవస్థాపకుడు , అతని భార్య, ఒక మహిళా సిబ్బందితో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
కేసు నమోదు, నిందితుల అరెస్ట్ వివరాలు
లాతూర్ పోలీస్ సూపరింటెండెంట్ (SP) అమోల్ తాంబే వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టాలలోని సంబంధిత నిబంధనల కింద మొత్తం ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరుగురిలో ఇప్పటికే ఆశ్రయ గృహం డైరెక్టర్ రవి బాపట్లే, అతని భార్య, సూపరింటెండెంట్ రచన బాపట్లే, ఉద్యోగి పూజా వాఘ్మారేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు, బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి అమిత్ మహాముని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీరితో పాటు, లాతూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన ఒక గైనకాలజిస్ట్‌ను కూడా నిందితులలో చేర్చారు. బాధితురాలిని బలవంతంగా గర్భస్రావం చేయించింది ఆ వైద్యురాలేనని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొంది.

ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చింది?
ధరాశివ్ జిల్లాకు చెందిన ఈ బాలికను సుమారు రెండేళ్ల క్రితం లాతూర్ జిల్లాలోని హోసేగావ్‌లో ఉన్న 'సేవాలయ' అనే హెచ్ఐవి సోకిన పిల్లల ఆశ్రయ గృహానికి తరలించారు. బాలిక తన ఫిర్యాదులో జులై 13, 2023 నుంచి జులై 23, 2025 మధ్య ఆశ్రయ గృహంలోని అమిత్ మహాముని అనే ఉద్యోగి తనపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. ఈ దారుణం గురించి తాను ఆశ్రయ గృహం యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ, వారు ఈ విషయాన్ని అణచివేసి, నిందితుడిని రక్షించడానికి ప్రయత్నించారని బాలిక తీవ్ర ఆరోపణలు చేసింది.
బాలిక తన బాధను ఒక లేఖ రూపంలో రాసి ఫిర్యాదు పెట్టెలో వేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న నిందితుడు ఆ లేఖను చించివేసి బాలికను తీవ్రంగా హెచ్చరించాడని పోలీసులు వెల్లడించారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆమె 4 నెలల గర్భవతినని వైద్య పరీక్షల్లో వెల్లడైంది. లాతూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సమ్మతి లేకుండానే ఆ గైనకాలజిస్ట్‌చే బలవంతంగా గర్భస్రావం అయ్యేలా చేశారని బాధితురాలు పేర్కొంది.
ఈ మొత్తం దారుణం ఇటీవల బాలిక ధరాశివ్‌లోని తన స్వగ్రామానికి చేరుకుని అక్కడి పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ధరాశివ్ పోలీసులు వెంటనే ఈ కేసును దర్యాప్తు నిమిత్తం లాతూర్ జిల్లాలోని ఔసా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ అమోల్ తాంబే స్పష్టం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ సునీల్ రేజిత్‌వాడ్ మాట్లాడుతూ.. విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి అనేక ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వెల్లడించారు. ప్రధాన నిందితుడు అమిత్ మహామునిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications