పబ్లిక్ ప్లేసుల్లో గుమికూడొద్దు, నైట్ కర్ఫ్యూ కూడా.. మహారాష్ట్ర కొత్త మార్గదర్శకాలు
ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోంది. కేసులు పెరగడంతో కర్ఫ్యూ తప్పడం లేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బాటలో మహారాష్ట్ర కూడా పడింది. కరోనా కోసం కొత్త మార్గదర్శకాలను మహారాష్ట్ర విడుదల చేసింది. పబ్లిక్ ప్లేసులలో ప్రజలు గుమికూడొద్దని స్పష్టంచేసింది. అలాగే రాత్రి పూట కర్ఫ్యూ కూడా విధిస్తామని తేల్చిచెప్పింది.
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు గుమికూడొద్దని ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2005 డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఈ మేరకు సీఎం ఉద్దవ్ థాకరే ట్వీట్ చేశారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇండోర్ వివాహానికి 100 మందిని మాత్రమే అనుమతిస్తారు. అలాగే అవుట్ డోర్ వివాహాలకు ఆ పరిమితి 250గా ఉంటుంది. జిమ్, స్పా, హోటల్, థియేటర్, సినిమా హాళ్లలో 50 శాతం కెపాసిటీకే అనుమతి ఉంది. అలాగే రాత్రి 9 గంటల తర్వాత ఉదయం 6 గంటల లోపు ఐదుగురి కన్నా ఎక్కువ ఉండొద్దని స్పస్టంచేసింది.

దుబాయ్ నుంచి వచ్చే వారికి ముంబై నగర పాలక సంస్థ కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ముంబైకి చెందిన వారు అయితే ఇంటి వద్ద 7 రోజులు క్వారంటైన్ ఉండాలని స్పష్టంచేసింది. ఏడవ రోజున ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేస్తారు. నెగటివ్ వస్తే ఏడు రోజులు స్వయంగా తనను తాను పరీక్షించుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. రేపటి నుంచి యూపీ స్టార్ట్ చేయనుంది. అన్నీ రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఎంపీ ముందడుగు వేసింది. యూపీ వేయబోతుంది. ఇటు ఒమిక్రాన్ నిలువరించడం బూస్టర్ డోసుతో సాధ్యం అని నిపుణులు తెలియజేశారు. ఇదీ కాస్త సానుకూల అంశంగా మారింది.
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మొత్తం 38కి చేరాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలోనూ ఒమిక్రాన్ గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.












Click it and Unblock the Notifications