రాష్ట్రంలో దేవాలయాల సందర్శనకు ఇకనుంచి డ్రెస్ కోడ్

మహారాష్ట్ర (Mahrashtra)లో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళుతున్నట్లయితే వస్త్రధారణపై దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే.. దైవదర్శన సందర్భంగా భక్తులకు సరైన వస్త్రధారణ నిబంధనలు (Dress Code) అమలు చేసే దిశగా అక్కడి దేవాలయాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడుకోవడానికి 'మహారాష్ట్ర మందిర్‌ మహాసంఘ్‌ 'విస్తృత ప్రచారం చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 130కిపైగా ఆలయాలు ఇప్పటికే ఈ డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నాయి. పుణ్యక్షేత్రాలకు 500 మీటర్ల పరిధిలో మద్యమాంసాల విక్రయాలపైనా నిషేధం విధించాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది. ఆలయ ధర్మకర్తలు, నిర్వాహకులు, పూజారులు, న్యాయవాదులు మహారాష్ట్ర మందిర్ మహాసంఘ్ లో కార్యకర్తలుగా ఉన్నారు.

Maharashtra Mandir Mahasangh demand to dress code in temple visit

ప్రజలను దేవుళ్లకు దూరం చేయడం తమ ఉద్దేశం కాదని, సోషల్ మీడియాలో ప్రచారం కోసం కొందరు ఆలయాలకు వచ్చి వీడియోలు చేస్తున్నారని మహాసంఘ్ సమన్వయకర్త సునీల్ తెలిపారు. ఏ ప్రార్థనా స్థలమైనా దాని పవిత్రతను కాపాడాలని, ఇందులో భాగంగానే ఆలయాలను దర్శించుకునే సమయంలో ఎటువంటి దుస్తులు ధరించకూడదనేదానిపై దృష్టిసారిస్తున్నామన్నారు.

బిగుతుగా ఉండే దుస్తులు, చిరిగిపోయిన దుస్తులు రివీలింగ్ వంటివి వస్తాయన్నారు. చొక్కా, ప్యాంటులపై ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ సంవత్సరం చివరకల్లా ఎక్కువ దేవాలయాలు దీన్ని అమలు చేస్తాయన్నారు. ఆచారం, సాంప్రదాయాలను అనుసరించి జరిగే జంతు బలులు మినహా ఆలయాలకు 500 మీటర్ల పరిధిలో మద్యంకానీ, మాంసంకానీ అమ్మకూడదని, వీటిపై నిషేదం విధించాలని సునీల్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+