అసెంబ్లీలో రమ్మీ ఆడుతున్న మంత్రి.. వీడియో వైరల్ !
ఒక వైపు వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే.. ఆ రాష్ట్ర మంత్రి మాత్రం తీరిగ్గా కూర్చొని ఫోన్‌లో రమ్మీ గేమ్ ఆడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రతిపక్ష నేత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది అంటే..
మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్ కోకెట్ ప్రవర్తనపై పెద్ద దుమారం రేగుతోంది. రైతుల సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి తన మొబైల్ ఫోన్‌లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఈ విషయాన్ని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్.. తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఆ మేరకు ఆ పోస్టులో రాష్ట్రంలో రోజుకు సగటున ఎనిమిది మంది రైతులు అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ వ్యవసాయ మంత్రి మాత్రం అసెంబ్లీలో తీరిగ్గా ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారు. ఇది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం" అంటూ మండిపడ్డారు.
అయితే ఇంతవరకు మంత్రి కోకెట్ ఈ వివాదంపై స్పందించకపోవడం గమనార్హం. కానీ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండటంతో, ఈ వివాదం మరింత రాజకీయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
మరోవైపు శివసేన (యూబీటీ) ప్రతినిధి ఆనంద్ దూబే స్పందిస్తూ.. మంత్రి కోకెట్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు విజ్ఞప్తి చేశారు. అలానే రైతు సంఘాల ప్రతినిధులు ఈ వ్యవహారాన్ని 'మానవత్వహీనత'గా అభివర్ణించారు. "రైతులు ప్రాణాలు తీసుకుంటుంటే, వ్యవసాయ మంత్రి గేమ్స్ ఆడటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications