వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rebel: ఏక్ నాథ్ షిండే వెనుక ఏ పార్టీ ఉంది అని దేశం మొత్తం తెలుసు, లేదంటే షిండేనే చెప్పాలి, పవార్ ఫైర్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి శివసేన లీడర్ ఏక్ నాథ్ షిండే కంకణం కట్టుకున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏక్ నాథ్ షిండేకి సంపూర్ణ మద్దతు ఇస్తోంది ఎన్సీపీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన మీద తిరుగుబాటు చేసిన తనకు ఓ జాతీయ పార్టీ మద్దతు ఇస్తోందని ఏక్ నాథ్ షిండే గుహవాటిలో మీడియాకు చెప్పారు. ఏక్ నాథ్ షిండే చెప్పిన మాటలకు కౌంటర్ గా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ మీద విమర్శలు చేశారు. ఏక్ నాథ్ షిండే వెనుక బీజేపీ ఉందని దేశం మొత్తం తెలుసు, కొత్తగా నేను చెప్పవలసింది ఏమీ లేదని శరద్ పవార్ ఆరోపించారు. ఇదే సమయంలో భారతీయ ఎన్నికల కమీషన్ గుర్తించిన అన్ని జాతీయ పార్టీల పేర్లు చెప్పిన శరద్ పవార్ ఈ పార్టీల్లో నీకు మద్దతు ఇస్తున్న జాతీయ పార్టీ ఏదో ప్రజలకు చెప్పాలని శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేని డిమాండ్ చేశారు.

Rebel camp: చీటి చింపేయడానికి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ అయ్యాడు, ఏక్ నాథ్ దెబ్బతో ఏమైనా జరగొచ్చు !Rebel camp: చీటి చింపేయడానికి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ అయ్యాడు, ఏక్ నాథ్ దెబ్బతో ఏమైనా జరగొచ్చు !

సినిమా చూపిస్తున్న ఏక్ నాథ్ షిండే

సినిమా చూపిస్తున్న ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీకి సినిమా చూపిస్తున్నాడు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. మేము శివసేన మీద తిరుగుబాటు చెయ్యడానికి అసలు కారణం కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు అని ఏక్ నాథ్ షిండే ఆరోపించారు.

 .జాతీయ పార్టీ మద్దతు ఇస్తోంది

.జాతీయ పార్టీ మద్దతు ఇస్తోంది

శివసేన మీద తిరుగుబాటు చేసిన తనకు ఓ జాతీయ పార్టీ మద్దతు ఇస్తోందని ఏక్ నాథ్ షిండే గుహవాటిలో మీడియాకు చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు నాయకులు శివసేన పార్టీ ఎమ్మెల్యేలను చిన్నచూపు చూశారని, ఇంతకాలం ఓపికగా ఉన్న మాపార్టీ ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి చివరికి తిరుగుబాటు చేశారని ఏక్ నాథ్ షిండే అన్నారు.

మండిపడిన శరద్ పవార్

మండిపడిన శరద్ పవార్

ఏక్ నాథ్ షిండే చెప్పిన మాటలకు కౌంటర్ గా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ మీద విమర్శలు చేశారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి శివసేన లీడర్ ఏక్ నాథ్ షిండే కంకణం కట్టుకున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏక్ నాథ్ షిండేకి సంపూర్ణ మద్దతు ఇస్తోంది ఎన్సీపీ చీఫ్ సంచలన ఆరోపణలు చేశారు.

ఏ పార్టీనో నువ్వే చెప్పు షిండే

ఏ పార్టీనో నువ్వే చెప్పు షిండే

ఏక్ నాథ్ షిండే వెనుక బీజేపీ ఉందని దేశం మొత్తం తెలుసు, కొత్తగా నేను చెప్పవలసింది ఏమీ లేదని శరద్ పవార్ ఆరోపించారు. ఇదే సమయంలో భారతీయ ఎన్నికల కమీషన్ గుర్తించిన జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్ పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఐ (ఎం) అని అన్ని పేర్లు చెప్పిన శరద్ పవార్ ఈ పార్టీల్లో నీకు మద్దతు ఇస్తున్న జాతీయ పార్టీ ఏదో ప్రజలకు చెప్పాలని శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేని డిమాండ్ చేశారు. మొత్తం మీద ఏక్ నాథ్ షిండే వెనుక బీజేపీ ఉండినడిపిస్తోందని శరద్ పవార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

English summary
Maharashtra political crisis: Sharad Pawar accused BP behind Eknath Shinde led rebellion in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X