వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Shiv Sena: సీఎంకు టెన్షన్ మొదలైయ్యింది, ఏక్ నాథ్ వర్గంపై వేటుపడింది, లిస్ట్ లో లేడీ లీడర్, దెబ్బకు!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గుహవాటి/థానే: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రోజురోజుకు మారుతున్న రాజకీయాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేకి శివసేన, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు పెరిగిపోవడం, గుహవాటిలో ఉంటున్న ఏక్ నాథ్ షిండే ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రేకి ఏం చెయ్యాలో అర్థంకాక సతమతం అవుతున్నారని తెలిసింది.

ఏక్ నాథ్ షిండేకి మద్దతు తెలుపుతున్న శివసేన పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నాయకుల మీద సీఎం ఉద్దవ్ ఠాక్రే వేటువేశారు. ఏక్ నాథ్ షిండేకి మద్దతు తెలుపుతున్న ఓ లేడీ లేడీర్ కూడా సస్పెండ్ అయ్యారు. ఇదే సమయంలో శివసేన కార్యాలయాల్లో ఉన్న ఏక్ నాథ్ షిండే ఫోటోలు, ఆయన వర్గం నాయకుల ఫోటోలు పీకేసి రోడ్ల మీదకు విసిరేశారు.

Sisters: ఐటీ హబ్ లో అరాచకం, రూ. లక్ష కోసం ఇంట్లో దూరి అక్కాచెల్లెలు బట్టలు చింపేసి ?, మీడియాలో!Sisters: ఐటీ హబ్ లో అరాచకం, రూ. లక్ష కోసం ఇంట్లో దూరి అక్కాచెల్లెలు బట్టలు చింపేసి ?, మీడియాలో!

ఏక్ నాథ్ కు పెరిగిపోతున్న మద్దతు

ఏక్ నాథ్ కు పెరిగిపోతున్న మద్దతు

రోజురోజుకు మారుతున్న రాజకీయాలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేకి శివసేన, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు పెరిగిపోవడంతో శివసేన నాయకులు రగిలిపోతున్నారు. ఇదే సమయంలో గురువారం ఉదయం మహారాష్ట్ర ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది.

సీఎంకు టెన్షన్ మొదలైయ్యింది

సీఎంకు టెన్షన్ మొదలైయ్యింది

ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేని లొంగదీసుకోవాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే, శివసేన నాయకులు చేసిన అనేక ప్రయత్నాలు మొత్తం విఫలం కావడంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకి టెన్షన్ మొదలైయ్యిందని తెలిసింది.

శివసేన నాయకుల మీద వేటుపడింది

శివసేన నాయకుల మీద వేటుపడింది

గుహవాటిలో ఉంటున్న శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకి ఏం చెయ్యాలో అర్థంకాక సతమతం అవుతున్నారని తెలిసింది. ఏక్ నాథ్ షిండేకి మద్దతు తెలుపుతున్న శివసేన పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నాయకుల మీద సీఎం ఉద్దవ్ ఠాక్రే వేటు వేశారు.

లిస్ట్ లో మాజీ మేయర్. లేడీ లీడర్

లిస్ట్ లో మాజీ మేయర్. లేడీ లీడర్

థానే సిటీ మాజీ మేయర్, శివసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన మీనాక్షి శింథే, థానే మాజీ మేయర్ నరేష్ మాస్కాన్, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ లోండేని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో శివసేన కార్యాలయాల్లో ఉన్న ఏక్ నాథ్ షిండే ఫోటోలు, ఆయన వర్గం నాయకుల ఫోటోలు పీకేసి రోడ్ల మీదకు విసిరేశారు.

English summary
Maharashtra Political Crisis: Tthree Thane leaders supporting rebel leader Eknath Shinde expelled from Shiv Sena
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X