టాయ్‌లెట్ ట్యాక్స్- మోదీ ఘాటు విమర్శలు

Maharashtra Assembly elecrtion 2024: ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది మహారాష్ట్ర. జార్ఖండ్‌తో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిన వెంటనే జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మహారాష్ట్రలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

Maharashtra polls 2024 PM Modi inaugurates and lays the stone of various projects in Thane

2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఈ సంఖ్యాబలాన్ని అందుకోలేదు. ఫలితంగా శివసేన- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది గానీ అది ఎంతో కాలం మనుగడ సాగించలేకపోయింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల దెబ్బకు కుప్పకూలింది.

శివసేనలో చీలికను తీసుకుని రాగలిగింది. ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేయగలిగింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తోన్నారు.

ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా. ఈ పరిణామాల మధ్య- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రపై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును గుమ్మరించారు. వీటి విలువ 32,800 కోట్ల రూపాయలు. థానేలో ఏర్పాటైన బహిరంగ సభలో మోదీ ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరి కొన్నింటిని ప్రారంభించారు.

బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుంచి ఆరె జేవీఎల్ఆర్ సెక్షన్ మధ్య నిర్మించిన ముంబై మెట్రో లైన్- 3ని మోదీ ప్రారంభించారు. దీని విలువ 14,120 కోట్ల రూపాయలు. 12,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన థానే ఇంటిగ్రెల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు మోదీ. ఏ మాత్రం నీతి, నిజాయితీ లేని అవినీతి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ఒక్కటేనని ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్‌ నేత డ్రగ్స్‌తో పట్టుబడ్డారని గుర్తు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్ టాయ్‌లెట్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+