స్టార్ హీరోయిన్ భర్త సంచలన నిర్ణయం
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- భారతీయ భారతీయ జనతా పార్టీ- ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీలు దశలవారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.
తాజాగా మహా వికాస్ అగాఢీలో భాగస్వామ్య పక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 22 మందితో కూడిన లిస్ట్ ఇది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థలను ఖరారు చేసింది. కొద్దిసేపటి కిందటే ఆ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ దీన్ని విడుదల చేశారు.

అనుశక్తి నగర్- ఫహద్ అహ్మద్, ఎరండోల్- సతీష్ అన్నా పాటిల్, గంగాపూర్- సతీష్ చవాన్, షాహాపూర్- పాండురంగ బరోరా, పరండా- రాహుల్ మోతె, బీడ్- సందీప్ క్షీర్‌సాగర్, అర్వి- మయూర కాలే, బగ్లాన్- దీపిక చవాన్, యెవ్లా- మాణిక్‌రావ్ షిండే, సిన్నర్- ఉదయ్ సాంగ్లె, డిండోరి- సునీత చరోస్కర్ పోటీలో ఉన్నారు.
నాసిక్ ఈస్ట్- గణేష్ గీతె, ఉల్హాస్ నగర్- ఒమి కలాని, జున్నార్- సత్యశీల్ షేర్కర్, పింప్రి- సులక్షణ షెల్వంత్, ఖడక్‌వాస్ల- సచిన్ దోడ్కే, పార్వతి- అశ్విని కదమ్, అకోలె- అమిత్ భాంగ్రె, అహల్యా నగర్- అభిషేక్ కలంకార్, మల్షిరాస్- ఉత్తమ్ రావ్ ఝంకార్, ఫాల్తన్- దీపక్ చవాన్, చాంద్‌గఢ్- నందినతాయి భబుల్కర్ కుపేకర్, ఇఛల్కరంజి- మదన్ కరందె బరిలో దిగారు
అనుశక్తి నగర్ నుంచి బరిలో దిగిన ఫహద్ అహ్మద్ మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వరా భాస్కర్ భర్త. శరద్ పవార్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ ఖరారైంది. అనుశక్తి నగర్‌లో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అభ్యర్థి సనా మలిక్‌పై పోటీ చేయనున్నారు.
2009లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికలను ఎదుర్కొంది. ఎన్సీపీ రెండుసార్లు విజయం సాధించింది. 2014లో అప్పటి ఉమ్మడి శివసేన విజయం సాధించింది. 2019లో మాజీ మంత్రి నవాబ్ మలిక్ ఇక్కడ గెలుపొందారు. ఇప్పుడు ఆయన కుమార్తె సనా మాలిక్ బరిలో దిగారు.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే.
ఈ ఎన్నికల కోసం ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది.












Click it and Unblock the Notifications