బంగారు చొక్కా, ఒళ్లంతా పసిడి: గోల్డ్‌మన్‌ను చంపేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

పుణే: మహారాష్ట్రలోని పూణేకు చెందిన గోల్డ్‌మన్ దత్తాత్రేయ పుగే దారుణ హత్యకు గురయ్యాడు. బంగారు చొక్కా, ఒంటినిండా పసిడితో ఆయన అందరి దృష్టిన ఆకర్షించిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవాు జామున గుర్తు తెలియని దుండగులు అతన్ని చంపేశారు.

రాళ్లతో కొట్టి, పదునైన ఆయుధాలతో దాడి చేసి అతన్ని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వక్రతుండ చిట్‌ఫండ్ పేరుతో పలువురి నుంచి డబ్బులు సేకరించి అతను అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి.

Maharashtra: Pune's 'Goldman' Dattatrey Phuge brutally killed; four arrested

ఆర్థిక అక్రమాల గొడవల నేపథ్యంలోనే అతన్ని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున అతన్ని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి హత్య చేశారు. 44 ఏళ్ల ఫుగే 1.27 కోట్ల రూపాయల విలువ చేసే పసిడి చొక్కా ధరించి గతంలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన 3.5 కిలోల బరువు గల చొక్కా ధరించి అతను వార్తల్లోకి ఎక్కాడు.

భొసరి ప్రాంతంలోని తమ ఇంటికి గురువారం రాత్రి కొంత మంది వచ్చి తన భర్తను తీసుకుని వెళ్లినట్లు దత్తాత్రేయ భార్య సీమా తెలిపారు. దిగిహి సమీపంలోని భారతమాత నగర్‌కు తీసుకుని వెళ్లి తన భర్యను హత్య చేశారని ఆమె చెప్పారు. దత్తాత్రేయ హత్య కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్టన్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Popularly known as the ‘goldman’ from Pimpri-Chinchwad, Dattatray Phuge’s 1.27crore gold shirt had grabbed eyeballs. He was killed with stones, sharp weapons.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి