మహారాష్ట్రలో కరోనా విలయం.. ఒక్కరోజే 67 వేల కేసులు, 419 మంది మృత్యువాత
కరోనా విలయం సృష్టిస్తోంది. దేశంలో భారీగా కేసులు వస్తున్నాయి. ఇక ఢిల్లీ, మహారాష్ట్ర గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 24 గంటల్లో కూడా భారీగానే కరోనా కేసులు వచ్చాయి. 67 వేల 123 కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆందోళన నెలకొంది. అయితే రికవరీ రేటు కూడా బాగానే ఉంది. ఇదీ కాస్త సానుకూల అంశం.
గత 24 గంటల్లో 419 మంది చనిపోయారు. మరణాల శాతం 1.59గా ఉంది. రికవరీ రేటు అయితే 81.18 శాతం ఉంది. శనివారం 56 వేల 783 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 30 లక్షలకు చేరింది. రాష్ట్రంలో 2.35 కోట్ల శాంపిల్స్ పరీక్షించగా.. 37 లక్షలకు పైగా అంటే 15.99 శాతం మందికి వైరస్ సోకింది. 35 లక్షల మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 25 వేలకు పైగా మంది ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఏప్రిల్ 17వ తేదీ వరకు 6 లక్షల 47 వుల 933 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Recommended Video
గత ఆదివారం కూడా ఎక్కువగానే కరోనా కేసులు వచ్చాయి. 63 వేల 294 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్ గడ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు 79.10 శాతంగా ఉన్నాయి. శుక్రవారం దేశంలో 2 లక్షల 17 వేల 353 మందికి వైరస్ వచ్చింది. దేశంలో 65.86 శాతం అంటే కేసులు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఉన్నాయి. 30.60 శాతం కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications