మహారాష్ట్రలో కరోనా కలవరం: 3వేలకు చేరువలో కొత్త కేసులు, ముంబైలోనే అత్యధికం

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు కాస్త పెరుగుతున్నాయి.తాజాగా, 2,946 కోవిడ్ 19 కేసులు, ఇద్దరు మరణాలు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య బులెటిన్ ఆదివారం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 16,370గా నమోదైంది.

శనివారం, రాష్ట్రంలో 2,922 COVID-19 కేసులు, ఒక మరణం నమోదైంది. ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో 61% ఇన్ఫెక్షన్లు ఒక్క ముంబై నుంచే నమోదయ్యాయి. ముంబైలో 1,803 తాజా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1,432 మంది రోగులు కరోనావైరస్ సంక్రమణ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో కోలుకున్న వారి సంఖ్య 77,46,337కు చేరుకుంది. రాష్ట్రంలో రికవరీ రేటు 97.92 శాతం.

 Maharashtra reports nearly 3,000 Coronavirus cases today, 61% from Mumbai alone

గత 24 గంటల్లో మొత్తం 42,922 పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన నమూనాల సంఖ్య 8,13,21,768కి చేరిందని బులెటిన్‌లో పేర్కొంది. మహారాష్ట్ర COVID-19 గణాంకాలు క్రింది విధంగా ఉన్నాయి:
కేసులు 79,10,577,
మరణాల సంఖ్య 1,47,870,
క్రియాశీల కేసులు 16,370,
పరీక్షలు 8,13,21,768.

మరోవైపు, ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగర ఆరోగ్య శాఖ పంచుకున్న డేటా ప్రకారం.. ఢిల్లీలో ఆదివారం 735 కొత్త COVID-19 కేసులు, వ్యాధి కారణంగా మూడు మరణాలు నమోదయ్యాయి, అయితే పాజిటివిటీ రేటు 4.35 శాతానికి పెరిగింది.

దేశ రాజధానిలో 600కి పైగా కేసులు నమోదు కావడం, 3 శాతం కంటే ఎక్కువ పాజిటివ్‌ రేటు నమోదు కావడం ఇది వరుసగా మూడో రోజు. ఆదివారం నమోదైన కొత్త కేసులతో, నగరంలో కోవిడ్ కేసుల సంఖ్య 19,12,798కి పెరిగిందని, మరణాల సంఖ్య 26,221కి చేరుకుందని డిపార్ట్‌మెంట్ తన తాజా బులెటిన్‌లో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+