Shiv Sena crisis: మాదే శివసేన, శివ సైనికులు ఎవరు ?, అడ్డదారిలో కాంగ్రెస్ తో ?, ఏక్ నాథ్ దెబ్బతో షాక్ !

ముంబాయి/గుహవాటి/ మహారాష్ట్ర: మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఆ పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదే నిజమైన శివసేన పార్టీ, మేము శివ సైనికులు, మీరు పార్టీ నియమాలు ఉల్లంఘించి అసహ్యంగా అడ్డదారిలో కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారు అని ఏక్ నాథ్ షిండే మండిపడుతున్నారు. మా గ్రూప్ లోని 12 మంది ఎమ్మెల్యేలపై మీరు ఎలా అనర్హత వేటు వేస్తారు ? అని ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లోని నాయకులను ప్రశ్నించారు. బాలా సాహేబ్ ఠాక్రేకి నిజమైన వారసులు మేమే, ఆ విషయం మహారాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, అనర్హత వేటు వేస్తామని మీరు బెదిరిస్తే అలాంటి బుడ్డ బెదిరింపులకు నేను కాని, ఇక్కడ ఉన్న శివసేన ఎమ్మెల్యేలు కాని భయపడరని శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ను పరోక్షంగా హెచ్చరించారు.

సీఎం గ్రూప్ డిమాండ్ ఇదే

సీఎం గ్రూప్ డిమాండ్ ఇదే

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్ నాథ్ షిండేతో సహ 12 మంది శివసేన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లోని నాయకులు ఎన్నికల కమీషన్ కు మనవి చేశారు. అనర్హత వేటు అనిచ చెప్పి రెబల్ ఎమ్మెల్యేలను వెనక్కి పిలిపించుకోవాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ అనేక ప్రయత్నాలు చేస్తోంది.

వార్నింగ్ ఇచ్చిన సంజయ్ రౌత్

వార్నింగ్ ఇచ్చిన సంజయ్ రౌత్

24 గంటల్లో వచ్చి సీఎం ఉద్దవ్ ఠాక్రేని కలవకపోతే మీమీద అనర్హత వేటు వేస్తామని శివసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఎలాగైనా గుహవాటిలో ఉన్న శివసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను ముంబాయి పిలిపించాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

మాదే శివసేన.... మేము శివ సైనికులు

మాదే శివసేన.... మేము శివ సైనికులు

మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఆ పార్టీ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదే నిజమైన శివసేన పార్టీ, మేము శివ సైనికులు, మీరు పార్టీ నియమాలు ఉల్లంఘించి అసహ్యంగా అడ్డదారిలో కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారు అని ఏక్ నాథ్ షిండే మండిపడుతున్నారు.

ఠాక్రేకి నిజమైన వారసులు మేమే

ఠాక్రేకి నిజమైన వారసులు మేమే

మా గ్రూప్ లోని 12 మంది ఎమ్మెల్యేలపై మీరు ఎలా అనర్హత వేటు వేస్తారు ? అని ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్దవ్ ఠాక్రే గ్రూప్ లోని నాయకులను ప్రశ్నించారు. బాలా సాహేబ్ ఠాక్రేకి నిజమైన వారసులు మేమే, ఆ విషయం మహారాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఆ విషయం మీరు గుర్తు పెట్టుకుని కాంగ్రెస్, ఎన్సీపీలకు దూరం కావాలని ఏక్ నాథ్ షిండ్ డిమాండ్ చేశారు.

బుడ్డ బెదిరింపులు చాలా చూశాము

బుడ్డ బెదిరింపులు చాలా చూశాము

అనర్హత వేటు వేస్తామని మీరు బెదిరిస్తే అలాంటి బుడ్డ బెదిరింపులకు నేను కాని, ఇక్కడ ఉన్న శివసేన ఎమ్మెల్యేలు కాని భయపడరని శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ను పరోక్షంగా హెచ్చరించారు. శివసేన పార్టీని నాశనం చెయ్యడానికి కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+