అసెంబ్లీలో ఫోన్ లో మంత్రి పాడు పని.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీ చాలా ముఖ్యమైన వేదిక. ప్రభుత్వాలు.. ఏదైనా పాలసీలు తీసుకురావాలన్నా.. చట్టాలు చేయలన్నా అసెంబ్లీలో సమావేశం అవుతారు. అలాంటి ఓ పవిత్రమైన స్థలంలో ఆ మంత్రి పాడు పని చేశాడు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా శ్రద్ధగా వాటిని విని ప్రశ్నలు, సమస్యలు లేవనెత్తాల్సింది పోయి హాయిగా ఫోన్ లో రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో జరిగింది. అయితే తాజాగా మంత్రి వ్యవహారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Maharashtra Agriculture Minister Manikrao Kokate Removed After Rummy Row, Gets Sports https://t.co/aTPCtlwrQz - #bharatjournal #news #bharat #india
— Bharat Journal (@BharatjournalX) July 31, 2025
మహారాష్ట్రలో నిండు అసెంబ్లీ సభలో రమ్మీ ఆడుతూ వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకాటే దొరికిపోయిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి మాత్రం రమ్మీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్స్ వినిపించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో మంత్రి మాణిక్ రావ్ ను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. ఆయనకు క్రీడాశాఖ అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత క్రీడామంత్రి దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖ అప్పగించింది. అయితే తాను అసెంబ్లీలో రమ్మీ ఆడలేదని.. కావాలనే ప్రతిపక్షాలు వదంతులు పుట్టిస్తున్నాయని మండిపడ్డారు. తాను అసెంబ్లీ సమావేశాలను లైవ్ చూసే క్రమంలో యూట్యూబ్ ఓపెన్ చేయగా రమ్మీ యాడ్ వచ్చిందని దాన్ని స్కిప్ చేసే సమయంలో వీడియో తీశారని పేర్కొన్నారు. తాను రైతుల కోసం చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications