సరదాగా స్విమ్మింగ్ కు వెళ్లి శవమై తేలారు.. 8 మంది విద్యార్థులు మృతి

ఒక్కోసారి విహార యాత్రలు.. విషాద యాత్రలుగా మిగిలిపోతుంటాయి. సరదాగా స్విమ్మింగ్ కోసం సముద్రంలోకి వెళ్లిన ఆ విద్యార్థులు విగతజీవులుగా మారారు. ఈ దుర్ఘటనలో 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో సంతోషంతో పిక్నిక్ కు వచ్చిన ఆ విద్యార్థులు అకాల మరణం తల్లిదండ్రులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ హృదయవిదారకమైన ఘటన మహారాష్ట్ర.. పుణేలోని రాయ్ ఘడ్ జిల్లాలో జరిగింది.

పుణేలోని అలందీలో ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌ కు చెందిన 48 మంది ఇంటర్ విద్యార్థులు టీచర్లతో కలిసి పిక్నిక్ కోసం దివియాగర్ బీచ్‌ కు వెళ్లారు. అయితే స్విమ్మింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 8 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. కొద్దిసేపటికే వాళ్లంతా విగతజీవులుగా మిగిలారు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకూ 8 మంది మృతదేహాలను వెలికి తీశామని తెలిపారు. ఇక ఈ టూర్ బృందంలో మొత్తం 48 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. అందులో 25 మంది అబ్బాయిలు, 17 మంది అమ్మాయిలు అలాగే ఆరుగురు టీచర్లు ఉన్నట్లు సమాచారం. ఇక ఘటన జరిగిన దివియాగర్ బీచ్ ప్రాంతం ముంబైకు సరాసరి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలుస్తోంది.

మొదట పిక్నిక్ గ్రూప్ లోని 48 మంది ఇంటర్ విద్యార్థుల్లో కొంతమంది స్విమ్మింగ్ కోసం వెళ్లారు. అయితే వారిలో 8 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వెంటనే తోటి స్నేహితులు స్థానికులను అప్రమత్తం చేశారు. అయితే స్థానికులతో కలిసి స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడి దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. ఇక విద్యార్థుల మృతదేహాలను బోర్లిపంచటన్ లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అందించనున్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి స్థాయి విచారణలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Maharashtra Tragedy during excursion eight students die incident at Maharashtra s Diveagar Beach

ఇక 10 రోజుల క్రితమే బిహార్ లో ఇలాంటి ఘటన జరిగి 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బిహార్ సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తరైత బహియార్ ప్రాంతంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+