మహా శివరాత్రి నాడు భక్తులకు తీవ్ర నిరాశ: తెరచుకోని ప్రఖ్యాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం
ముంబై: త్రయంబకేశ్వరాలయం.. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గోదావరి నదీమతల్లి జన్మస్థానంగా విరాజిల్లుతోంది. షిర్డీ సాయినాథున్ని సందర్శించడానికి వెళ్లే ప్రతి ఒక్కరూ త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రోజూ వేల మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఇది. మహా శివరాత్రి నాడు భక్తలు తాకిడి రెట్టింపు అవుతుంటుంది. లక్షల్లో భక్తులు మహాశివుడిని కొలుస్తుంటారు. రాత్రంతా జాగారణ చేస్తుంటారు. అలాంటి పుణ్యక్షేత్రం ప్రస్తుతం మూగబోయింది. భక్తుల కోసం తెరచుకోలేదు. మహా శివరాత్రి పర్వదినం నాడు కూడా ఈ ఆలయాన్ని మూసి ఉంచారు.
భక్తులకు దర్శనానికి అనుమతించట్లేదు. కారణం- కరోనా మహమ్మారి. మహారాష్ట్రలో కొద్దిరోజులుగా చాప కింద నీరులా విజృంభిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆలయాన్ని మూసి వేశారు. 50 మంది వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంది. ఆలయ అర్చకులు, వారి కటుంబీకులు, స్థానికులకు మాత్రమే దర్శనాన్ని కల్పిస్తున్నారు. నాసిక్ జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది. రోజువారీ కేసులక్కడ వేలల్లో నమోదవుతున్నాయి.

దీనితో ముందు జాగ్రత్త చర్యగా త్రయంబకేశ్వరం ఆలయాన్ని మూసి ఉంచాలని నిర్ణయించినట్లు ఆలయ ట్రస్టీ సత్యప్రియ శుక్లా తెలిపారు. మహా శివరాత్రి నాడు నిర్వహించే పూజలన్నీ యధాతథంగా కొనసాగుతాయని, భక్తులకు అనుమతి ఉండదని చెప్పారు. స్వామివారి పల్లకీ సేవలో అర్చకులకు మాత్రమే అనుమతి ఇచ్చామని అసిస్టెంట్ కలెక్టర్, త్రయంబకేశ్వరం సబ్-డివిజనల్ అధికారి శుభం గుప్తా పేర్కొన్నారు. కరోనా ప్రొటోకాల్ ప్రకారం.. అర్చకులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ప్రొటోకాల్ కొనసాగిస్తామని అన్నారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు భయానకంగా విస్తరిస్తోన్నాయి.. కొద్దిరోజులుగా. వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం విడుదలైన బులెటిన్ ప్రకారం.. 24 గంటల్లో కొత్తగా మహారాష్ట్రలో 13,659 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే అక్కడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నాసిక్ జిల్లాలోనే 1,33,539 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,26,929 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,084 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలతో త్రయంబకేశ్వరాలయాన్ని మూసి ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications