వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కార్ మారింది-క్లీన్ చిట్ దొరికింది-సమీర్ వాంఖడే జన్మతః ముస్లిం కాదని నివేదిక

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాక్రే సర్కార్ హయాంలో ఓడలో డ్రగ్ రాకెట్ ను పట్టుకున్న అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే అనూహ్యంగా వివాదాల్లో చిక్కుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో అన్నట్లుగా పోరాడిన ఆయన అప్పట్లో కుల ధృవీకరణ వివాదంలో పడ్డారు. జన్మతః ముస్లిం అయిన సమీర్ వాంఖడే మధ్యలో కులం మార్చుకున్నారంటూ కేసులు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు జరుపుతున్న కుల ధృవీకరణ విచారణ కమిటీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసును అప్పటి నుంచి విచారిస్తున్న కమిటీ.. తాజాగా నివేదిక ఇచ్చింది. అయితే రాష్ట్రంలో ఉద్ధవ్ థాక్రే స్దానంలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఈ నివేదికపైనా ఆ ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. తాజా నివేదికలో సమీర్ వాంఖడే జనతః ముస్లిం కాదని నిర్ధారణ అయింది. వాంఖడే వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రాన్ని కూడా కమిటీ సమర్థించింది. 91 పేజీల ఆర్డర్‌లో, ప్యానెల్ గతంలో నమోదైన అన్ని వాదనలను తిరస్కరించింది. అలాగే వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని నిర్ధారించింది. సమీర్ వాంఖడే , అతని తండ్రి ద్యానేశ్వర్ వాంఖడే హిందూ మతాన్ని త్యజించలేదని, ముస్లిం మతాన్ని స్వీకరించారని కూడా కమిటీ నిర్ధారించింది.

maharastra govt clean chit to ex-ncb official sameer wankhede in certificate case

సమీర్ వాంఖడే, ఆయన తండ్రి హిందూ మతంలో గుర్తించిన మహర్-37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని తాజా నివేదిక పేర్కొంది. దీంతో వెంటనే దీనిపై స్పందించిన వాంఖడే.. ట్విట్టర్‌లో "సత్యమేవ జయతే" అని పోస్టు పెట్టారు. మహారాష్ట్ర కేబినెట్‌ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ సమీర్‌ వాంఖడే కులం సర్టిఫికెట్‌పై ఫిర్యాదు చేసిన మనోజ్‌ సంసారే, అశోక్‌ కాంబ్లే, సంజయ్‌ కాంబ్లే తదితర ఫిర్యాదులు తమ వాదనను సమర్థించలేకపోయాయని కమిటీ పేర్కొంది.

English summary
maharastra govt has given clean chit to former ncb director sameer wankhede in caste certificate case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X