మహాత్మా గాంధీ మనుమడు కానూభాయ్ కన్నుమూత
సూరత్: జాతిపిత మహాత్మా గాంధీ మనుమడు కానూభాయ్ గాంధీ(87) సూరత్‌లో సోమవారం కన్నుమూశారు. గాంధీజీ మూడో కుమారుడు రాందాస్ గాంధీ పుత్రుడైన కానూభాయ్ తన భార్య శివలక్ష్మితో కలిసి పంజాబీ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఇక్కడి రాధాకృష్ణ ఆలయ ఆశ్రమంలో ఉంటుండేవారు.
ఆయనకు అక్టోబర్ 22న గుండెపోటు రావడంతో సూరత్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కానూభాయ్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కాగా, నాసాశాస్త్రవేత్తగా, అమెరికా రక్షణ శాఖ ఉద్యోగిగా సేవలందించిన ఆయన మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మి(90)ని వివాహం చేసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆయనకు భార్య తప్ప నా అనే వారు ఎవరూ లేరు. 40 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న కానూ దంపతులు రెండేళ్ల క్రితం భారత్‌కు తిరిగి వచ్చారు. వీరికి సంతానం లేదు.
ఉద్యోగం ద్వారా సంపాదించినది దానధర్మాలకు ఖర్చు చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు. ఈక్రమంలో అనారోగ్యం పాలైన ఆయన ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబరు 22న వచ్చిన గుండె పోటు కారణంగా కానూ పక్షవాతానికి గురయ్యారు. ఫలితంగా ఎడమవైపు శరీర భాగం చచ్చుబడిపోయింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications