మహాత్మా గాంధీ మునిమనవరాలికి జైలు శిక్ష..!

మహాత్మా గాంధీ... భారత జాతిపితగా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా సత్యం, అహింసకు ప్రతీకగా గుర్తింపు పొందారు. కానీ ఇప్పుడు ఆయన వారసులు.. ప్రజలను మోసం చేసిన ఘటనలో జైలు పాలు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గాంధీ మనుమరాలు, మానవహక్కుల కార్యకర్త ఎలా గాంధీ కుమార్తె.. లతా రామ్‌గోబిన్ (56) దారుణ మోసం కేసులో దోషిగా తేలారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకోగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

డర్బన్‌లోని స్పెషలైజ్డ్ కమర్షియల్ క్రైం కోర్టు లతా రామ్‌గోబిన్‌కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది. 2015లో దాదాపు రూ.3.22 కోట్ల విలువైన మోసం కేసులో నేరం రుజువవడంతో ఈ తీర్పు వెలువడింది. కోర్టు ఆమె అప్పీల్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా తిరస్కరించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

mahatma-gandhis-great-granddaughter-sentenced-to-prison

లతా రామ్‌గోబిన్ న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ఎస్‌ఆర్ మహరాజ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె తాను భారత్‌ నుంచి లైనెన్ వస్తువులను దిగుమతి చేస్తానని, వాటిని దక్షిణాఫ్రికాలోని ప్రముఖ ప్రైవేట్ హెల్త్‌కేర్ సంస్థ నెట్‌కేర్‌కి సరఫరా చేస్తానని చెప్పి, దిగుమతి సుంకాలు, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు అడిగారు. అంతే కాకుండా అతన్ని నమ్మించేందుకు లతా నకిలీ పర్చేజ్ ఆర్డర్లు, ఇన్వాయిస్‌లు, బ్యాంక్ ధృవీకరణ పత్రాలు చూపించారు.

నెట్‌కేర్ కంపెనీకి వస్తువులు సరఫరా చేసినట్లుగా డెలివరీ నోట్‌లు చూపించారు. తన కుటుంబ నేపథ్యం, సామాజిక సేవలను ఉపయోగించి ఆమె వ్యాపారుడిని ప్రభావితం చేశారు. లాభాలొస్తాయని ఆశించిన మహరాజ్‌ రూ.3.22 కోట్లకు సమానమైన 6 మిలియన్ రాండ్స్‌ ఆమెకు ఇచ్చారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, అసలు దిగుమతులే జరగలేదని, నెట్‌కేర్‌కి ఎలాంటి సంబంధమూ లేదని తెలిసింది. దీంతో మోసపోయిన మహరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా నేషనల్ ప్రాసిక్యూషన్ అథారిటీ ప్రతినిధులు లతా ఇమెయిల్‌లు, ఫేక్ ఇన్వాయిస్‌లు సృష్టించి మోసం చేశారని తెలిపారు. నేరం పూర్తి స్థాయిలో రుజువైనందున కోర్టు కఠినంగా వ్యవహరించింది.

ఇది గాంధీ కుటుంబ గౌరవానికి భంగం కలిగించే అంశంగా భావిస్తున్నారు. సమాజానికి మార్గదర్శకులుగా నిలవాల్సిన ప్రముఖుల వారసులు.. మోసం చేసిన కేసులో దోషిగా మారడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+