విమానం దిగుతుంటే ల్యాండింగ్ గేర్ బద్దలు
ముంబై: విమానం దిగుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్ బద్దలైన సంఘటన ముంబై ఎయిర్ పోర్టులో జరిగింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయం సిబ్బంది చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానం ముంబై బయలుదేరింది. ఈ విమానంలో 127 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ముంబై విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో ఒక్క సారిగా ల్యాండింగ్ గేర్ బద్దలైయ్యింది. పైలెట్ చాకచక్యంగా విమానాన్ని అదుపు చేసి రన్ వే మీద నిలిపివేశాడు.

విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ప్రయాణికులను సురక్షితంగా కిందకుదింపారు. ప్రధాన రన్ వే పూర్తిగా బ్లాక్ అయ్యింది. బోయింగ్ 737 విమానం 9 డబ్ల్యూ 354లో సాంకేతిక లోపం తలెత్తడం వలనే ల్యాండింగ్ గేర్ చెడిపోయిందని జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications