Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తప్పిన పెను ప్రమాదం.. 453 కేజీల బాంబు.. ఎక్కడంటే ?

దీపావళికి చిన్న చిన్న బాంబులు పేలిస్తేనే.. గుయ్ అనే సౌండ్ తో చెవులు చిల్లులు పడిపోతుంటాయ్. ఇక బాంబ్ బ్లాస్ట్ జరిగితే చోటు చేసుకునే మరణాలు, విషాదం మాటల్లో వర్ణించలేనిది. అదే 453 కేజీల బాంబు పేలితే ఎలా ఉంటుంది. ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది ఈ విజువల్. ఎన్ని మరణాలు, ఎంతటి విషాదం.. వర్ణించలేని శోకమే మిగులుతుంది. ఇంతటి పెను ప్రమాదం తప్పడం అంటే చాలా చాలా మంచి విషయమని చెప్పాలి. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వర్వాండిలో జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 453 కేజీల బరువున్న భారీ బాంబును ఆర్మీ అధికారులు సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో వందలాది ప్రాణాలు ప్రమాదం నుంచి బయటపడ్డాయి.
ఈ సంఘటన మార్చి 28న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక రైతు రాజేంద్ర ధాగే తన పొలంలో ఆరడుగుల భూమి లోపల ఏర్పాటుచేసుకున్న పైపులు పగిలిపోవడంతో వాటిని మరమ్మతు చేయడానికి తవ్వకం చేస్తున్న సమయంలో ఒక బాంబు పిన్ కనిపించిందని రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చాడు.

దీంతో తహసీల్దార్ జ్ఞాన్‌దేవ్ బెల్హేకర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం పంపించారు. వెంటనే అధికారులు ప్రాంతాన్ని ఖాళీ చేయించి, బాంబును సమర్థవంతంగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు. ఆ తర్వాత పుణెకు చెందిన వైమానిక, ఆర్మీ దళాలకు చెందిన 10 మంది నిపుణులు వర్వాండికి చేరుకున్నారు. నెల రోజులపాటు శ్రమించి జేసీబీ సహాయంతో బాంబు చుట్టూ ఏడడుగుల గొయ్యి తవ్వారు. ఆ తర్వాత బాంబు స్క్వాడ్ బృందాల సహాయంతో బాంబును నిర్వీర్యం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

major-accident-that-was-avoided-453-kg-bomb-where-is-it

బాంబు 4.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగి ఉందని.. మొత్తం 453 కేజీల బరువు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. నిర్వీర్యం చేసిన తర్వాత బాంబును ప్రత్యేక వాహనంలో అహల్యానగర్ సమీపంలోని కెకె రేంజ్‌కు తరలించారు. ప్రయాణ సమయంలో భద్రతా చర్యలుగా ఆ మార్గంలో అరగంటపాటు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. బాంబు పేలి ఉంటే కిలోమీటర్ల మేర ఇళ్లు నేలమట్టమయ్యేవని.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని పేర్కొన్నారు.

ఈ ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి పెను ప్రమాదాన్ని తప్పించిన రైతు రాజేంద్రను అధికారులు అభినందించారు. బాంబు అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+