యూజర్లకు పట్టపగలు చుక్కలు చూపించిన ఎయిర్ టెల్
ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ స్తంభించిపోయింది. కొన్ని గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఒక చోటో, రెండు చోట్లో కాదు.. దేశంలోని పలు ప్రాంతాల్లో వేలాది మంది ఎయిర్‌టెల్ కస్టమర్లు కాల్స్ చేయడానికి, మెసేజ్‌లు పంపడానికి లేదా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యేకించి- హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల నుండి లక్షల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. రోజులో రెండుసార్లు ఎయిర్ టెల్ సేవలు స్తంభించిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై యూజర్లు భగ్గుమంటోన్నారు. తిట్టని తిట్లు తిడుతున్నారు. మొబైల్ నెట్ వర్క్ షట్ డౌన్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ డెటెక్టర్ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఈ నెల 18వ తేదీ నుంచీ ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో తరచూ అంతరాయం ఏర్పడుతూనే వస్తోందని తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 12:15 నిమిషాల నుండి అంతరాయంపై ఫిర్యాదులు విపరీంగా పెరుగుతూ వచ్చినట్లు వివరించింది. నిమిషాల వ్యవధిలో 7,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి.
అదే సమస్య నేడు కూడా ఉత్పన్నమైంది. ఈ ఉదయం నుంచి రెండుసార్లకు పైగా ఎయిర్ టెల్ సర్వీసులు స్తంభించిపోయాయి. దీనితో ఎయిర్ టెల్ యాజమాన్యంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తోన్నారు యూజర్లు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై విపరీతంగా కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు.
కాల్స్, ఇంటర్నెట్, నెట్‌వర్క్ రిసెప్షన్ లేకపోవడంపై ఫిర్యాదులు చేశారు. ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ వేల సంఖ్యలో పోస్టులు పెట్టారు. తక్షణమే దీన్ని సరిదిద్దాలని, నెట్ వర్క్ పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్ట్ పెయిడ్ సర్వీసులు సైతం స్తంభించిపోవడంతో యూజర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాతో సహా పలు నగరాల్లోని వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారని డౌన్ డిటెక్టర్ మ్యాప్ స్పష్టం చేసింది. చాలా మంది నెట్‌వర్క్ వైఫల్యాలు ఎయిర్‌టెల్‌లో పునరావృతమవుతున్న సమస్య అని పేర్కొనగా, మరికొందరు ఎయిర్‌టెల్ దృష్టిని ఆకర్షించడానికి ఫన్నీ మీమ్స్, జోకులను సృష్టించారు.
దీనిపై ఎయిర్ టెల్ స్పందించింది. నెట్ వర్క్ డౌన్ సమస్య ఉందని అంగీకరించింది. దీన్ని తాత్కాలిక కనెక్టివిటీ అంతరాయంగా అభివర్ణించింది. సమస్యను పరిష్కరించడానికి తమ టెక్ టీమ్స్ కృషి చేస్తున్నాయని తెలిపింది. వీలైనంత త్వరగా సర్వీసులను పునరుద్ధరిస్తామని వివరించింది.
ఎయిర్‌టెల్ యూజర్లు.. ఫోన్ కాల్స్, మెసేజీలు, ఇంటర్ నెట్ సేవల పొందలేకపోతే, కొంత సమయం తర్వాత తమ మొబైల్ ఫోన్‌లను రీస్టార్ట్ చేయాలని సూచించింది. మున్ముందు ఇలాంటి నెట్ వర్క్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకంటామని హామీ ఇచ్చింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications