నోయిడా ఎస్ఈజెడ్‌లో అగ్నిప్రమాదం .. రంగంలోకి దిగిన 12 ఫైరింజన్లు
న్యూఢిల్లీ : వర్షాకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. కానీ అగ్నిప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఢిల్లీలో ఓ ఫైర్ యాక్సిడెంట్ జరుగగా .. తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. అయితే నోయిడా స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ప్రమాదం జరగడం కలవరానికి గురిచేస్తోంది.

ప్రమాదం ..
నోయిడాలోని ఎస్ఈజెడ్‌లో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఆ ప్రదేశంలో పొగ చూరి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. ఎస్ఈజెడ్‌లో ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలో ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కార్మికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 12 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలానికి పోలీసు బలగాలు కూడా చేరుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఆస్తినష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications