దూసుకొచ్చిన వాహనం: రన్ వేపై తృటిలో తప్పిన ప్రమాదం
అమృత్ సర్: విమానాశ్రయంలో ఒక వాహనం దూసుకు వచ్చి అలజడి సృష్టించింది. తృటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం అమృత్ సర్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
ఢిల్లీ నుండి అమృత్ సర్ విమానాశ్రయానికి స్పైస్ జెట్ విమానం వచ్చింది. సోమవారం ఉదయం విమానాశ్రయంలో ఉన్న విమానంలో ప్రయాణికులు కుర్చున్నారు. గాలిలో ఎగరడానికి విమానం సిద్దంగా ఉంది. ఆ సందర్బంలో రన్ వే మీదకు ఐఏఎఫ్ ట్రక్ దూసుకు వెళ్లింది.

ఆ సందర్బంలో విమానాశ్రయంలోని అధికారులు హడలిపోయారు. విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడ్డాయి. అధికారులు ట్రక్ దగ్గరకు పరుగు తీశారు. ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. రెడ్ సిగ్నల్ పడి ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఈ సందర్బంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది మధ్య వాగ్వివాదం జరిగింది. రెడ్ సిగ్నల్ పడి ఉన్న సమయంలో ఒక ట్రక్ రన్ వే మీదకు ఎలా వచ్చిందంటూ వాగ్వివాదానికి దిగారు. అయితే
తృటిలో ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications