హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వండి - చిన్నచూపు తగదు : మలాలా కీలక వ్యాఖ్యలు..!!

ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన హిజాబ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వ్యవహారం పైన ఇతర రాష్ట్రాల్లోనూ చర్చ సాగుతోంది. కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఈ అంశం పైన నిరసనలు కొనసాగుతున్నాయి. పోటా పోటీగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం సున్నితంగా మారటంతో కర్ణాటక ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలను మూసి వేసింది. ఇదే సమయంలో కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సీఎం బొమ్మై సూచించారు.

మలాల ఆవేదన - అభ్యంతరం

ఇక, ఇదే అంశం పైన ఉద్యమకారిణి, నోబెల్​ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. చదువు.. హిజాబ్‌లో ఏది ఎంచుకోవాలో కళాశాల మమ్మల్ని బలవంతం చేస్తోంది అంటూ విద్యార్థిణిలు ఆవేదనను ట్వీట్​ చేసిన మలాలా భారత్ లోని నేతలకు విజ్ఞప్తి చేశారు.

బాలికలు తమ హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకంగా ఉందంటూ కామెంట్ చేసారు.. ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు.

ట్వీట్ ద్వారా కీలక విజ్ఞప్తి

ట్వీట్ ద్వారా కీలక విజ్ఞప్తి

భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపును ఆపాలంటూ కీలక వ్యాఖ్యతో ట్వీట్​ చేశారు. ఇక, ఇదే అంశం పైన హిజాబ్​ ధరించిన ఆడపిల్లలను క్లాస్​ రూంల్లోకి రైట్​ వింగ్​ గ్రూపులు అనుమతించకపోవడం మరింత వివాదాస్పదంగా మారుతోంది. పోటీగా కాషాయపు కండువాలతో ర్యాలీలు చేపట్టడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం సామరస్యం పాటిస్తూ.. శాంతి భద్రతలు పాటించాలని పిలుపు ఇస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ హిజాబ్​ అభ్యంతరం గళం వినిపిస్తోంది.

ముఖ్యమంత్రి అప్పీల్ తో...

ముఖ్యమంత్రి అప్పీల్ తో...

మధ్యప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి ఇందర్​ సింగ్​ పర్మర్​​ 'హిజాబ్​ యూనిఫామ్​లో భాగం కాదని, క్రమశిక్షణ ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం పైన ప్రముఖ నటుడు కమల్ హసన్ స్పందించారు. తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాలు ఇటువంటి వ్యవహార పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే, కోర్టు తీర్పు తరువాతనే దీని పైన ఫైనల్ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఈ వివాదం వ్యాపిస్తోన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+