ఓటు వెయ్యకపోయినా పర్వాలేదు, నా అంత్యక్రియలకు రండి, ప్రధాని అభ్యర్థి, మోదీని టార్గెట్ చేసి !

కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి రాకపోయినా పర్వాలేదని, కనీసం నేను చనిపోయినప్పుడు నా అంత్యక్రియలకైనా రండి, మీరు నన్ను కాల్చేస్తే కొవ్వొత్తి వెలిగించండి, నన్ను పాతిపెట్టినట్లయితే కనీసం మట్టి వెయ్యడానికి అయినా రండి, ఇంతకు మించి నేను ఏమీ చెప్పను అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖార్గే భావోద్వేగంతో అన్నారు. మల్లికార్జున్ ఖార్గే వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి.

కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫజల్‌పూర్‌ లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభ కార్యక్రమంలో మాట్లాడిన మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదని, నేను చనిపోతే నా అంత్యక్రియలకు చెయ్యాల్సిన పనులు గుర్తుంచుకుని మట్టి వేయడానికి రండి, అంత్యక్రియలకు ఎంతమంది వచ్చారు అని ప్రజలే చెప్పుకోవాలని మల్లికార్జున్ ఖార్గే ఉద్వేగానికి లోనయ్యారు. నేను అఫ్జల్‌పూర్‌లోనే ఓడిపోయానని చెప్పలేను. ఎందుకంటే నన్ను ఓడించేందుకు మిగిలిన దేశమంతా ఒక్కటైందని మల్లికార్జున్ ఖార్గే గతం గుర్తు చేశారు.

Mallikarjun Kharge said it doesn t matter if Congress doesn t vote come to my funeral

అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్, సూలిబెలే కలిసి ఇక్కడ క్యాంపులు వేసి నన్ను టార్గెట్ చేశారు. అయినా కలబురగి ప్రజలు నన్ను వదులుకోరని భావించి కొంచెం నిర్లక్షం చెయ్యడం వలన తాను ఓడిపోయానని మల్లికార్జున్ ఖార్గే గతం గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ అక్కడక్కడా ఇప్పటికీ తనను ఓడించామని చెప్పుకుంటున్నారని మల్లికార్జున్ ఖార్గే విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల మంగళసూత్రాలు లాక్కొంటారని ప్రధాని మోదీ చెప్పడం సిగ్గుచేటు అని మల్లికార్జున్ ఖార్గే అన్నారు.

ప్రధానమంత్రి హోదాలో మోదీ మహిళల గురించి ఇలా చులకనగా మాట్లాడుతున్నారని మల్లికార్జున్ ఖార్గే మండిపడ్డారు. మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఎన్నో పథకాలు అమలు చేసిందని, కానీ మాంగళసూత్రాన్ని మాత్రం తీసుకోలేదని ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మండిపడ్డారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మేలు చేసే అనేక పథకాలను ప్రస్తావించిందని మల్లికార్జున్ ఖార్గే గుర్తు చేశారు.

మోదీ ఈ దేశ ప్రజల కోసం పని చెయ్యడంలేదని, మోదీ అమిత్ షా దేశం కోసం పని చెయ్యకుండా అంబానీ, అదానీల కోసం పని చేస్తన్నారని మల్లికార్జున్ ఖార్గే విమర్శించారు. పోయినసారి తాను ఓడిపోయానని బాధలేదని, ఆ ఓటమి నుంచి బయటకి వచ్చానని, ఈసారి మీరంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ను గెలిపించి బీజేపీ తగిన బుద్దిచెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఖార్గే ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+