రూ.6వేల కోట్లు షెల్ కంపెనీలకు: విజయ్ మాల్యాకు మరో షాక్
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో షాక్ తగలబోతుంది. సిబిఐ, ఈడీలు ఆయనపై తాజాగా మరో చార్జీషీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో షాక్ తగలబోతుంది. సిబిఐ, ఈడీలు ఆయనపై తాజాగా మరో చార్జీషీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఆయన షెల్ కంపెనీలకు తరలించినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విజయ్ మాల్యాపై చార్జీషీట్ దాఖలు చేసేందుకు దర్యాఫ్తు సంస్థలు సిద్ధమయ్యాయి.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, లండన్ వంటి ఏడు దేశాల షెల్ కంపెనీలకు ఈ నిధులను మరలించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. యూకే నుంచి మాల్యాను భారత్ రప్పించి, కేసుకు తమ ఈ ఆధారాలు మరింత బలోపేతం చేయనున్నాయని దర్యాఫ్తు సంస్థలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications