వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనూ సూద్ సోదరి కూడా పరాజయం.. ఆప్ గాలిలో తప్పని అపజయం

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో అంచనాలు తలకిందులు అయ్యాయి. ఉద్దండులు ఓటమి పాలయ్యారు. చన్నీ, సిద్దూ, అమరీందర్ సింగ్ పరాజయానికి గురయ్యారు. వారి జాబితాలోనే ప్రముఖ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ చేరారు. అయితే ఆమె 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మోగా నియోజకవర్గం నుంచి ఆమె బరిలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం చెందారు. 58 వేల 813 ఓట్ల తేడాతో అమన్ దీప్ గెలుపొందారు. మాళవికకు 38 వేల 125 ఓట్లు వచ్చినట్లు సమాచారం. అంటే 20 వేల ఓట్ల తేడా ఉంది.

కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలు అందరికీ గుర్తున్నాయి. అతని సోదరి కూడా సామాజిక సేవలో పాల్గొన్నారు. పంజాబ్‌లో ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తాను మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదని సోనూ సూద్ ప్రకటించారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ అనూహ్యంగా మొదటి నుంచి వెనుకంజలో కొనసాగుతూ వచ్చి,. చివరకు ఓడిపోయారు.

Malvika Sood Loses Moga By Over 20k Votes

ఆప్ ధాటికి కాంగ్రెస్‌తోపాటు బీజేపీ పత్తా లేకుండా పోయాయి. పంజాబ్‌లో ఆప్ ఏకపక్షంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. తాము రాజకీయాలు చేయం అని.. ఢిల్లీ అభివృద్ధిని చూడండి.. అదే ఇక్కడ రిపీట్‌ చేస్తామని సైలెంట్‌ ప్రచారం చేసింది. ఈ వ్యూహాలే పంజాబ్‌లో ఆప్‌ పాగా వేయడానికి కారణం అయ్యాయి.

అయితే పంజాబ్‌లో చక్రం తిప్పాలని సిద్దూ అనుకున్నాడు. తమ పార్టీ విజయం తథ్యం అని అంచనా వేశారు. కానీ సిద్దూ వల్లే కాంగ్రెస్ ప్రభ తగ్గిందని విశ్లేషకులు అంటారు. మంత్రిగా ఉన్న సమయం నుంచి అమరీందర్‌తో పడలేదు. గత సెప్టెంబర్‌లో రాజీనామా కూడా చేసి హల్ చల్ చేశాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అమరీందర్ సింగ్‌ను సీఎం పదవీ నుంచి తప్పించారు. అప్పుడు పీసీసీ చీఫ్‌గా కొనసాగుతోన్న.. సీఎం పోస్టుపై మనసు ఉండేంది. ఇంతలో చన్నీని సీఎం చేయడంతో మింగలేక కక్కలేని పరిస్థితి. అలా ఎన్నికలకు వచ్చి.. గెలుద్దామని అనుకున్నారు. కానీ ప్రజలు ఆప్ వైపు మొగ్గుచూపారు.

English summary
Congress candidate from Punjab's Moga constituency, Malvika Sood has been defeated by AAP’s Dr Amandeep Kaur Arora by over 20,000 votes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X