దీదీ ఆస్తుల చూస్తే షాక్ అవ్వాల్సిందే! సంచలన అఫిడవిట్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 'దీదీ'గా పిలవబడే మమతా బెనర్జీ మరోసారి తన నిరాడంబరతతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల వేళ రాజకీయ నేతల ఆస్తులు కోట్లలో పెరుగుతుంటే, ఒక రాష్ట్రానికి మూడు దశాబ్దాలకు పైగా ప్రజా ప్రతినిధిగా, దశాబ్ద కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత ఆస్తుల వివరాలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. దేశంలోనే అత్యంత 'పేద' ముఖ్యమంత్రిగా ఆమె తన రికార్డును కాపాడుకున్నారు.

రాజకీయాల్లో అధికారం ఉంటే ఆస్తులు వెల్లువలా వస్తాయనే విమర్శలకు భిన్నంగా నిలుస్తున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచీ మళ్లీ పోటీ చేస్తున్న ఆమె, ఎన్నికల సంఘానికి సమర్పించిన తాజా అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక ముఖ్యమంత్రి వద్ద ఉండాల్సిన కనీస విలాసాలు కూడా ఆమె దరిదాపుల్లో లేకపోవడం విశేషం.

Mamata Banerjee 2026 Election Affidavit West Bengal CM Declares Zero Fixed Assets and Only 9 Grams of Gold

సొంత ఇల్లు, భూమి లేని సీఎం!

మమతా బెనర్జీ అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు సొంతంగా కారు లేదు, కనీసం నివసించడానికి ఒక ఇల్లు గానీ, ఒక్క గజం వ్యవసాయ భూమి గానీ ఆమె పేరు మీద లేదు. ఏడు సార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా, ఆమె తనకంటూ ఎటువంటి స్థిరాస్తులను కూడబెట్టుకోలేదు. ఆమె మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.15.4 లక్షలు మాత్రమే. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం.. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న వ్యక్తిగా ఆమె అగ్రస్థానంలో ఉన్నారు.

నగదు - బంగారు ఆభరణాలు..

అఫిడవిట్ సమర్పించే నాటికి మమత చేతిలో రూ.75,700 నగదు ఉంది. ఆమె వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రూ.12.4 లక్షలు ఉండగా, ఎన్నికల ఖర్చుల కోసం మరో ఖాతాలో రూ.40,000 ఉన్నాయి. ఆభరణాల విషయానికి వస్తే, కేవలం 9.7 గ్రాముల బంగారం (సుమారు రూ.1.45 లక్షల విలువైనది) మాత్రమే ఆమె వద్ద ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమెకు ఎటువంటి అప్పులు లేవు, అలాగే ఆమెపై ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా పెండింగ్‌లో లేవు.

జీతం తీసుకోరు.. పెన్షన్ వద్దన్నారు!

ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ భారీ జీతం తీసుకునే అవకాశం ఉన్నా, దానికి ఆమె స్వచ్ఛందంగా దూరంగా ఉంటున్నారు. ఎంపీగా వచ్చే పెన్షన్‌ను కూడా ఆమె తీసుకోవడం లేదని గతంలోనే ప్రకటించారు. మరి ఆమెకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే.. ఆమె రాసిన పుస్తకాలకు వచ్చే 'రాయల్టీ', బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ మాత్రమే ఆమెకు ఉన్న ఏకైక జీవనాధారం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆమె ఆదాయం రూ.23.2 లక్షలుగా చూపారు.

ముఖ్యమంత్రుల ఆస్తుల పోలిక..

ఏడీఆర్ నివేదిక ప్రకారం.. దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల పట్టికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్లకు పైగా ఆస్తులతో మొదటి స్థానంలో ఉండగా, మమతా బెనర్జీ కేవలం రూ.15.4 లక్షలతో అట్టడుగున (నిరుపేద సీఎం) నిలిచారు. ఆమె పక్కన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (రూ.55 లక్షలు), కేరళ సీఎం పినరయి విజయన్ (రూ.1 కోటి) ఉన్నారు.

కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ పట్టా పొందిన మమతా బెనర్జీ, తన సాధారణ జీవనశైలితో మరోసారి తన పంతాన్ని నిరూపించుకున్నారు. అధికారం తలకెక్కించుకోకుండా, ప్రజల మధ్య సామాన్యురాలిగా ఉండే 'దీదీ' తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+