వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాళాలు పగులగొట్టి .. పార్టీ పేరు, గుర్తు రాసి : నౌహతిలో దీదీ సంచలనం

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. బీజేపీ నేతల చర్యలకు ధీటుగా బదులిస్తున్నారు. తాజాగా దీదీ చేసిన ఓ సాహస చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ ఆక్రమించిన కార్యాలయానికి టీఎంసీ గుర్తు పెయింట్ వేసి సంచలనం సృష్టించారు మమతా.

కార్యాలయం ఆక్రమణ ..
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పూర్తి జోష్ మీద ఉంది. ముఖ్యంగా బెంగాల్‌లో అధికార టీఎంసీకి చెక్ పెడుతూ ముందుకు సాగుతుంది. టీఎంసీ నేతలను పార్టీలో చేర్చుకోవడం .. ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుంది. ఈ క్రమంలో నైహతిలో గల అధికార టీఎంసీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ నేతలు ఆక్రమించారు. టీఎంసీ గుర్తులు తీసేసి .. కాషాయం పూసి తమ పార్టీ కార్యాలయని ప్రకటించుకున్నారు. తర్వాత తాళం వేశారు. ఈ విషయం తెలుసుకున్న మమత ఆ పార్టీకి తగినరీతిలో బుద్దిచెప్పారు.

Mamata Banerjee breaks open BJP office, paints party symbol on wall

టీఎంసీ .. జెండా
టీఎంసీ నేతలతో కలిసి కార్యాలయానికి వెళ్లిన దీదీ .. ఆఫీసు తాళలను పగులగొట్టారు. అక్కడ గల గోడపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని రాశారు. తర్వాత షటర్‌కు టీఎంసీ గుర్తును స్వయంగా పెయింట్ వేశారు మమతా. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు టీఎంసీ కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మమత గతనెల 30న ప్రతీచర్యకు దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజే రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేశారు. ఇటీవల టీఎంసీకి చెందిన నౌహతి కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. దీనిని నిరసిస్తూ మమతా 30వ తేదీ నౌహతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తర్వాత పార్టీ కార్యాలయం నుంచి బీజేపీ ఆక్రమించుకున్న కార్యాలయం వద్దకెళ్లి .. స్వాధీనం చేసుకున్నారు.

English summary
west Bengal Chief Minister Mamata Banerjee on Thursday (May 30) broke open a Bharatiya Janata Party (BJP) office in Naihati area of North 24 Parganas district and painted her party's name - All India Trinamool Congress - and symbol on the office's saffron wall. The incident allegedly happened on May 30. Trinamool Congress has claimed that it was their office which was captured by supporters of the newly elected BJP MP Arjun Singh, who had won from Barrackpore after defeating the TMC candidate, Dinesh Trivedi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X