అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమత షాకింగ్ డిమాండ్- ఎన్నో అనుమానాలు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. భార్య సునేత్రా పవార్, కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తోన్న మరో ముగ్గురు కూడా మరణించారు. ఆయన ప్రయాణిస్తోన్న విమానం కొద్దిసేపటి కిందటే మహారాష్ట్రలోని బారామతిలో కుప్పకూలింది.

అజిత్ పవార్‌కు చెందిన ప్రైవేట్ విమానం అది. ఈ ఉదయం బారామతి సమీపంలో కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదం ల్యాండింగ్ సమయంలో సంభవించిందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అజిత్ పవార్ ఈ తెల్లవారు జామున బారామతికి బయలుదేరారు. బారామతికి సమీపించిన అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పైలెట్ ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది.

Mamata Banerjee called for investigation into the plane crash that killed Deputy CM Ajit Pawar

ఈ విషాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సరైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర ప్రజలకు తీరని లోటుగా అభివర్ణించారు. ఈ ఘటన తనను కలచివేసిందని, మహారాష్ట్ర రాజకీయాలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.

అజిత్ పవార్ కుటుంబం, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటన.. అసాధారణంగా అభిప్రాయపడుతున్నారు మమత బెనర్జీ. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ కు కారణం- మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలే ప్రధాన కారణమని తెలుస్తోంది.

అజిత్ పవార్ మరణవార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర మొత్తం విషాదసంద్రంలో మునిగిపోయింది. ప్రత్యేకించి- పవార్ కుటుంబానికి గట్టి పట్టు ఉన్న బారామతిలో విషాద ఛాయలు అలముకున్నాయి. నేడు జరగాల్సిన అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. అటు ప్రభుత్వం కూడా నేటి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింద. పలువురు మంత్రులు దుఖాన్ని ఆపుకోలేకపోయారు. మాజీ మంత్రి, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) నేత అనిల్ దేశ్ ముఖ్ మీడియా ముందే కన్నీరు మున్నీరు అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+