వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనో పెద్ద గాడిదను -ద్రోహుల్ని గుర్తించలేకపోయా -బెంగాల్ సీఎం మమత -సువేందు అవినీతి రూ.5వేల కోట్లు

|
Google Oneindia TeluguNews

తొలి దశ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ పశ్చిమ బెంగాల్ లో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతున్నది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, టీఎంసీ తరఫున బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఆదివారం ప్రచారాన్ని హోరెత్తించారు. రెండు పార్టీల నేతలూ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. కాగా, సొంత వాళ్ల చేతిలోనే ద్రోహానికి గురయ్యానంటూ దీదీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

కరోనా రెండోసారి వ్యాప్తి పచ్చి బూటకం -కార్పొరేట్ కంపెనీల లబ్ది కోసమే -ఆర్. నారాయణమూర్తి సంచలనంకరోనా రెండోసారి వ్యాప్తి పచ్చి బూటకం -కార్పొరేట్ కంపెనీల లబ్ది కోసమే -ఆర్. నారాయణమూర్తి సంచలనం

మొన్నటి దాకా మమత కేబినెట్ లో మంత్రిగా, టీఎంసీలో కీలక నేతగా వ్యవహరించిన సువేందు అధికారి.. కొన్నాళ్ల కిందటే బీజేపీ చేరి, ఇప్పుడు బెంగాల్ సీఎంపైనే నందిగ్రామ్ లో తలపడుతుండటం తెలిసిందే. సువేందు అధికారి కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం మమత మరోసారి విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు ఆ కుటుంబ నిజస్వరూపం తెలుసుకోలేకపోయానని అన్నారు. ఆదివారం కాంతి దక్షిణ్‌ ప్రాంతంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ దీదీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee calls herself donkey for not recognising Traitor suvendu Adhikari

''నిజం చెప్పాలంటే తప్పు నాదే. నేనో పెద్ద గాడిదను. మేకవన్నె పులుల్ని గుర్తించలేకపోయాను. ద్రోహుల నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను. సువేందు అధికారి కుటుంబం రూ.5000 కోట్లతో పెద్ద అవినీతి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుందని ప్రజలు చెబుతున్నారు. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓటర్లను కొనబోతున్నారు. అలాంటి వారికి ఓటేయకండి'' అని మమత వ్యాఖ్యానించారు.

నందిగ్రామ్ ప్రాంతంలో టీఎంసీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని సువేందుకు అధికారి కుటుంబం తమ ఖాతాలోకి వేసుకుంటోందని, జమీందారుల్లా వ్యవహరిస్తున్నారని మమత మండిపడ్డారు. రాష్ట్రం శాంతి సామరస్యాలతో, అభివృద్ధి బాటలో పయనించాలంటే బీజేపీని బెంగాల్ కు దూరంగా ఉంచాలన్నారు మమత. కాగా,

తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!తిరుపతి పోరు: బీజేపీ సంచలనం -జనసేనకు విడిగా సొంత కమిటీ -దాసరికి చోటు -టికెట్ రత్నప్రభకే!

సువేందు అధికారి శిశిర్ అధికారి సైతం ఆదివారం టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో శిశిర్ కాషాయతీర్థం పుచ్చుకున్నారు. టీఎంసీ కోసం ఎంతో చేసిన కుటుంబాన్ని మమత విస్మరించిందని, అందుకే పార్టీ మారుతున్నామని శిశిర్ అధికారి చెప్పారు. సువేందుకు ద్రోహిగా మమత అభివర్ణించడం దారుణమని, నందిగ్రామ్‌లో ఆమెకు ఓటమి తప్పదని శిశిర్ అన్నారు.

English summary
West Bengal Chief Minister and Trinamool Congress supremo Mamata Banerjee on Sunday blamed herself for not recognising the "true face" of the influential Adhikari family of Purba Medinipur district and called herself a "big donkey" for being unable to do so. Venting her ire against Suvendu Adhikari, her protege-turned-rival who is pitted against the TMC leader from Nandigram constituency for the coming assembly polls, Banerjee said at an election rally here, she had even heard rumours the Adhikari family had built an empire worth Rs 5,000 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X