మమత బెనర్జీ దూకుడుతో తన సమాధిని తానే తవ్వుకుంటుంది : అపర్ణా సేన్
జై శ్రీరాం అంటూ వస్తున్ననినాదాలపై మండిపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సమాధిని తానే తవ్వుకుంటుందని ఫిలిం నిర్మాత , జాతీయ అవార్డు గ్రహిత అపర్ణ సేన్ వ్యాఖ్యనించారు.కాగా రాజకీయాలు, మతం వేరని అమే అభిప్రాయపడ్డారు. జైశ్రీరాం తోపాటు ,అల్లా హు అక్బర్, జై మహంకాళీ లాంటీ నినాదాలను ఎవ్వరు ఆపలేమని స్పష్టం చేశారు.

కాగా అన్ని సమస్యలను రాజకీయ కోణంలో చూడడం ద్వారనే ఇలాంటీవి ఉత్పన్నమవుతున్నాయని ఆమే అన్నారు.రాజకీయాలను ,మతాలను ఏకం చేయడం కరెక్టు కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ రైట్ ను కల్గి ఉన్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే జైశ్రీరాం తోపాటు ,అల్లా హు అక్బర్, జై మహంకాళీ లాంటీ నినాదాలను తాము ఆపలేమని స్పష్టం చేశారు.కాగా జై శ్రీరాం నినాదాలు చేస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీ కారు దిగి రావడాన్ని ఆమే వ్యతిరేకించారు.
గత ఎన్నికల్లో మమతా మంచి మెజారీటి సాధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారని అన్నారు.అయితే ఆమే ప్రవర్తన తీరుపట్ట బెంగాల్ ప్రజలు అసంతృప్తితో
ఉన్నారని , ఆమే ప్రవర్తిస్తున్న తీరే ఆమే ఓటమికి కారణమవుతుందని అపర్ణ సేన్ తెలిపారు












Click it and Unblock the Notifications