ఇండియా ప్రధాని అభ్యర్థి ఆయనే: ఏకగ్రీవంగా జై కొట్టిన ప్రతిపక్షాలు: సౌత్ నుంచి ఎంపిక

Mallikarjun Kharge: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటైన ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కూటమి ఇండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చింది.

దేశవ్యాప్త ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఇండియా పేరుతో కూటమి కట్టిన విషయం తెలిసిందే. గతంలో పాట్నా, బెంగళూరు, ముంబైల్లో భేటీ కొనసాగింది. నాలుగో విడతగా దేశ రాజధానిలో ఈ సమావేశం అయ్యాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా 28 పక్షాలు ఇందులో కొనసాగుతున్నాయి.

Mamata Banerjee proposed Mallikarjun Kharge as PM face for INDIA bloc

ఈ భేటీ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. ప్రధానంగా- వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి పేరుపై ఓ నిర్ణయానికి వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి ప్రధాని అభ్యర్థిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించాయి. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి అవుతారని స్పష్టం చేశాయి.

ఈ భేటీ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే పేరును తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రతిపాదించారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బలపరిచారు. దాదాపుగా ఆయన పేరు ఏకగ్రీవం అయినట్టే. ఈ విషయాన్ని ఇండియా కూటమి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ప్రధాన మంత్రిగా దళిత నాయకుడి పేరును ప్రకటించడం తమ విజయానికి దోహదపడుతుందని ఇండియా కూటమి భావిస్తోంది. అత్యంత కీలకమైన కన్వీనర్ పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మమతా బెనర్జీ, జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లల్లో ఒకరిని ఎన్నుకుంటారని సమాచారం.

సమావేశం అనంతరం మమత బెనర్జీ విలేకరులతో మాట్లాడారు. తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు విడుదలు, బకాయిలు విడుదల కావాల్సి ఉందని, దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు 10 మంది ఎంపీలతో కూడిన ఓ ప్రతినిధుల బృందాన్ని పంపించనున్నట్లు చెప్పారు. నిజానికి- మమత బెనర్జీ స్వయంగా మోదీని కలుస్తారని భావించినప్పటికీ.. అది కుదరలేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+