జగన్, కేసీఆర్‌లను దూరం పెట్టారా: విపక్ష ముఖ్యమంత్రులకు మమత బెనర్జీ సంచలన లేఖ
కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీర్భూమ్ సామూహిక హత్యాకాండ అనంతరం అధికార తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమత బెనర్జీపై రాజకీయ దాడులు తీవ్రతరం అయ్యాయి. భారతీయ జనతా పార్టీ ఆమెపై ముప్పేటదాడి సాగిస్తోంది. బీర్భూమ్ ఘటనపై విచారణ అధికారాన్ని సీబీఐకి బదలాయించిన తరువాత బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తృణమూల్‌పై నిప్పులు చెరుగుతున్నారు.

రాజకీయ దాడి..
ఈ పరిణామాలతో మమత బెనర్జీ ఉక్కిరబిక్కిరికి గురి అవుతున్నారు. బీర్భూమ్ ఉదంతంలో ప్రభుత్వ ప్రమేయం గానీ, తమ పార్టీ నాయకుల జోక్యం గానీ లేదంటూ ఎదురుదాడికి దిగుతున్నప్పటికీ.. అది ఫలించట్లేదు. ఈ పరిణామాల మధ్య మమత బెనర్జీ- మరోసారి బీజేపీయేతర పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నాలకు తెర తీశారు. ఈ మేరకు ఆమె ఈ ఉదయం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులకు లేఖ రాశారు.

కేంద్రీయ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం..
బీజేపీ ప్రభుత్వం కేంద్రీయ దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలపై అవాంఛనీయ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇన్‌కమ్ ట్యాక్స్.. వంటి సంస్థలను ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. వాటి ద్వారా దాడులు చేయించి- బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

కేంద్రం దూకుడుగా..
దీన్ని సంయుక్తంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. దీనికోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అకారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలపై సాగుతున్న ఈ రాజకీయపరమైన దాడిని ఎదుర్కొనడానికి కలిసి రావాలని అన్నారు. గత సంవత్సరం పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ స్పెషల్ పోలీస్ (అమెండ్‌మెంట్) బిల్లు 2021ను బుల్‌డోజ్ చేసిందని గుర్తు చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బిల్లు 2021పైనా అలాంటి వైఖరినే ప్రదర్శించిందని గుర్తు చేశారు.

సమైక్యంగా తిప్పి కొట్టేలా..
రాష్ట్రాల అధికారాలను నియంత్రించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని మమత బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అనైతిక దాడులను సమైక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, బీజేపీని నిలువరించకపోతే- భవిష్యత్తులో బీజేపీయేతర పార్టీలు అధికారంలో రాష్ట్రాల మనుగడ ప్రమాదంలో పడుతుందని చెప్పారు. నిధుల కేటాయింపులోనూ తీవ్ర వివక్షతకు పాల్పడుతోందని ఆరోపించారు.

లేఖ అందలేదన్న నవీన్ పట్నాయక్..
కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే మమత బెనర్జీ లేఖ రాసినట్టు తెలుస్తోంది. మమత బెనర్జీ రాసిన లేఖ తనకు అందలేదని బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. ఇవ్వాళ ఆయన ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ భవన సముదాయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. మమత బెనర్జీ లేఖ రాశారనే విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణలకూ..
ఏపీ, తెలంగాణల్లో అధికారంలో ఉన్న పార్టీలకు కూడా మమత బెనర్జీ లేఖ రాయలేదని సమాచారం. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరికి పోకుండా- ముందు నుంచీ తటస్థంగా ఉంటూ వస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయనట్టే. తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications