మమతపై ముకుల్‌రాయ్ సంచలన ఆరోపణలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై టిఎంసి మాజీ నేత, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి ముకుల్‌రాయ్ సంచలన ఆరోపణలు చేశారు.ముకుల్ రాయ్ ఇటీవలనే టిఎంసీని వీడి బిజెపిలో చేరారు.

  Gujarat Assembly Eections: Amit Shah Kicks Off Door-To-Door Campaign

  బీజేపీలో చేరిన వారం రోజుల అనంతరం ముకుల్‌రాయ్ తొలిసారి పెదవివిప్పారు. శారదా స్కామ్‌, డెంగ్యూ మరణాలు, విద్య, ఆరోగ్యం సహా పలు అంశాల్లో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. శారదా బాస్ సుదీప్తా సేన్‌ను మమతా బెనర్జీ పలుమార్లు కలుసుకున్నారని ముకుల్ రాయ్ ఆరోపించారు.

  Mamata met Saradha boss several times: Mukul Roy in his first BJP rally

  శుక్రవారనాడు కోల్‌కత్తాలో జరిగిన బిజెపి ర్యాలీలో ముకుల్ రాయ్ ఈ ఆరోపణలు చేశారు. కలింపాగ్‌లోని డెలోలో జరిగిన సమావేశంలో టీఎంసీ ఎంపీ కునల్ ఘోష్‌తో కలిసి తాను కూడా పాల్గొన్నట్టు చెప్పారు. 'ప్రతిదిన్ కార్యాలయం, పెయింటర్ సువప్రసన్న నివాసంలో ఈ సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. మీడియా, టూరిజం, అంబెలెన్స్ కొనుగోళ్లలో సుదీప్త సేన్ రూ.849 కోట్లు పెట్టుబడి పెట్టారని అని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని విషయాలు ప్రజల ముందుంచుతానని కూడ ముకుల్‌రాయ్ ప్రకటించారు.

  శారదా చిట్‌ఫండ్ స్కామ్, అందులో పలువురు అధికార పార్టీ నేతల ప్రమేయంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో రాయ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై కూడా రాయ్ ఆరోపణలు చేశారు.

  అభిషేక్ బెనర్జీకి సొంత కంపెనీ బిస్వబంగ్లాలోనే తృణమూల్ కాంగ్రెస్ ప్రచార సామగ్రి, పార్టీ సాహిత్యం, ముద్రించేవారని ముకుల్ రాయ్ చెప్పారు. అయితే ఈ విషయాలు అధికార పార్టీలోని కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసునన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయినందునే తాను ఆ పార్టీకి ఉద్వాస చెప్పినట్టు రాయ్ తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Seven days after joining BJP, former Union railway minister and Trinamool Congress number two, Mukul Roy, launched a broadside at chief minister Mamata Banerjee on Friday in Kolkata when he attacked her and her nephew Abhishek Banerjee on a number of issues ranging from Saradha scam to dengue deaths and education to health.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి