వేట: ఐఎస్ జెండా రూపకర్త చెన్నై ఇంజనీర్
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరుడు గట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎఐస్) జెండాను రూపొందించిన వ్యక్తి తమిళనాడు రాజధాని చెన్నైలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించినట్లు బయటపడింది. ఆ వ్యక్తి ఐఎస్ కాలిఫేట్ జెండా, లోగోలను రూపొందించి ఇచ్చినట్లు కేసు నమోదైంది.
అతని తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు జాతీయ భద్రత సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. అందులోని వివరాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ వివరాల ప్రకారం - ఇస్లామిక్ స్టేట్ కాలిఫేట్ కోసం జెండాను, లోగోలను చెన్నైలో ఇంజినీరింగ్ చదివిన మహ్మద్ నాజిర్ రూపొందించాడు.

గత డిసెంబరులో సిరియా వెళ్ళేందుకు సూడాన్ చేరుకున్న నాజిర్‌ను అక్కడి పోలీసులు నిర్బంధించి, భారతదేశానికి పంపించారు. నాజిర్ తండ్రి అమీర్ మహ్మద్ దుబాయ్‌లో ప్యాకర్‌గా పనిచేస్తున్నారు. తన కొడుకు సిరియాలో యుద్ధం కోసం వెళ్తున్నట్లు తెలుసుకున్న అమీర్ వెంటనే భారతదేశానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమీర్ స్టేట్‌మెంట్‌ను సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం ఎన్ఐఏ అధికారులు నమోదు చేశారు. అతని కొడుకుకు వ్యతిరేకంగా అత్యంత కీలక సాక్షుల్లో ఒకరిగా అమీర్ పేరును చేర్చారు. చార్జిషీట్‌ను ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి అమర్‌నాథ్‌కు సమర్పించారు. నాజిర్ సూడాన్ వెళ్ళిన తర్వాత తన తండ్రికి ఈ-మెయిళ్ళు పంపించాడు. తాను సంతోషంగా ఉన్నానని సందేశాలు ఇచ్చాడు.
అమ్మను, సుమైయాను బాగా చూసుకోండని, ఇక్కడ నేను క్షేమంగా ఉన్నానని, జీవితం చాలా అద్భుతంగా గడుస్తోందని, మీరందరూ దావ్లాహ్‌కు రావాలని కోరుకుంటున్నానని నాజిర్ రాశాడు. తండ్రీకొడుకుల మధ్య సాగిన ఈ-మెయిళ్ళు, టెక్స్ట్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లను ప్రధాన సాక్ష్యాలుగా ఎన్ఐఏ నమోదు చేసుకుంది.
నిందితుడు నాజిర్ తాను ఐఎస్‌లో చేరినట్లు తన తండ్రికి చెప్పాడని, అందువల్ల అతను తిరిగి ప్రధాన జీవన స్రవంతిలో కలిసే అవకాశం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 9న జరుగుతుంది
నాజిర్ చెన్నైలోని ఓ కళాశాలలో బీఈ చదివాడని, ఉద్యోగం కోసం 2014లో దుబాయ్ వెళ్ళాడని ఎన్ఐఏ తెలిపింది. కొంతకాలం పాటు నెలకు 2500 దిర్హామ్‌ల జీతంపై వెబ్ డెవలపర్, గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశాడని చెప్పింది. ఐఎస్ ప్రచార వీడియోలను చూసిన తర్వాత రాడికల్‌గా మారాడని తెలిపింది.
తన యజమాని నుంచి తన పాస్‌పోర్టును దొంగిలించి, యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా సూడాన్ వెళ్లాడని వివరించింది. ఆన్‌లైన్ గ్రూప్ ద్వారా జైపూర్‌లోని ఇండియన్ ఆయిల్ మేనేజర్ మహ్మద్ సిరాజుద్దీన్‌తో సంప్రదింపులు జరిపేవాడని చెప్పారు. సిరాజుద్దీన్‌పై చార్జిషీట్‌ను శనివారం దాఖలు చేస్తారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications