జిమ్ యజమానితో అక్రమ సంబంధం.. భర్తను లేపేయడానికి ఏం చేశారంటే?
ఇందుకోసం భోజనంలో నిద్రమాత్రలు వేసి అందరికీ వడ్డించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అదే భోజనాన్ని తాను కూడా తిన్నది.
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా.. భర్తను, అత్తను హత్య చేయడానికి కుట్ర పన్నిన ఓ వివాహిత పన్నాగానికి పోలీసులు చెక్ పెట్టారు. అన్నంలో విషం కలిపి.. ఆపై ప్రియుడి చేత దాడి చేయించిన వివాహిత.. ప్లాన్ బెడిసికొడుతుందని ఊహించలేదు. ఈలోగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం కథంతా అడ్డం తిరిగింది.
ఢిల్లీలోని భల్స్వా డైరీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రతీరోజూ జిమ్ కు వెళ్లే సదరు వివాహిత(40)కు జిమ్ యజమాని అబ్దుల్(27)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం ఇంట్లో తెలిసి.. అత్త, భర్త ఇద్దరూ ఆమెను మందలించారు. దీంతో తమ సంబంధానికి వీరిద్దరు అడ్డుగా ఉన్నారని భావించిన వివాహిత ప్రియుడితో కలిసి వారిని చంపేయాలని నిర్ణయించుకుంది.

ఇందుకోసం భోజనంలో నిద్రమాత్రలు వేసి అందరికీ వడ్డించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అదే భోజనాన్ని తాను కూడా తిన్నది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. భోజనం తిని ఆమె భర్త, అత్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. ప్రియుడు అబ్దుల్ వారిపై దాడి చేశాడు. చనిపోయి ఉంటారనుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఆపై పోలీసులు వచ్చి దీనిపై ఆరా తీయగా.. ఇంట్లో వాళ్లపైనే వారికి అనుమానం కలిగింది. ఎక్కడా ఎలాంటి వస్తువులు చోరీకి గురికాకపోవడంతో.. ఇది దొంగల పని కాదని నిర్దారించుకున్నారు. ఆపై ఆ ఇల్లాలిని విచారించగా.. నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందునా.. డిశ్చార్జీ అయిన వెంటనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications