బజారులో వ్యాపారి తల నరికి తీసుకు వెళ్లాడు
కోలకతా: ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా ఒక వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన పశ్చి మ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా లోని బెలపహారీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 30 సంవత్సరాల కూరగాయల వ్యాపారి హత్యకు గురైనాడు.
హత్య చేసిన బుద్దేశ్వర్ పాల్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బుద్దేశ్వర్ పాల్ బెలపహారికి వెళ్లాడు. ఆ సందర్బంలో కూరగాయల వ్యాపారితో గొడవపడ్డాడు. మాటమాట పెరిగింది. తరువాత సహనం కొల్పోయిన బుద్దేశ్వర్ పాల్ అక్కడి నుండి వెళ్లాడు.

తరువాత బుద్దేశ్వర్ పాల్ బలమైన ఆయుధం తీసుకు వచ్చి కూరగాయల వ్యాపారి మీద దాడి చేశాడు. అతని తల నరికి వేశాడు. తల ఎగిరి కిందపడింది. అందరూ చూస్తున్న సమయంలో బుద్దేశ్వర్ పాల్ ఈ దారుణ హత్య చేశాడు. స్థానికులు హడలిపోయారు.
తరువాత బుద్దేశ్వర్ పాల్ తల చేతిలో పట్టుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మొండెం స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి పేరు, వివరాలు తెలియడం లేదని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications