భార్య వెళ్లిపోయిందని ఉరేసుకుని భర్త ఆత్మహత్య

మృతుడిని 38 ఏళ్ల ఎస్ సెల్వంగా గుర్తించారు. దినసరి వేతనంపై అతను లోడ్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. తాగి వచ్చి భార్యతో తరుచుగా అతను గొడవ పడుతూ ఉండేవాడు. వారికి ఐదుగురు పిల్లలున్నారు. గతవారం భార్యతో అతను గొడవ పడ్డాడు. దాంతో ఆమె ఇంటి నుంచి పెళ్లిపోయింది.
ఇంట్లో అతను ఒంటరిగానే ఉండసాగాడు. తన భార్య మంజును సెల్వం తాగి వచ్చి కొడుతూ ఉండేవాడని అంటున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య కోసం అతను అంతటా వెతికాడు. బంధువులను వాకబు చేశాడు. అయినా ఆమె జాడ కనిపించలేదు.
పోలీసుల కథనం ప్రకారం - సెల్వం, మంజు 14 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారున. అప్పటి నుంచి కూడా వారు అరివోజీ నగర్‌లోనే ఉంటున్నారు. తన భర్త ప్రవర్తన నచ్చక మంజు తన నలుగురు పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపించింది. చిన్న కూతురు దర్శిని తరుచుగా దగ్గర్లో ఉండే బంధువుల ఇంట ఉండేది.












Click it and Unblock the Notifications