తన భార్యతో బెడ్రూంలో స్నేహితుడు.. భర్త ఏం చేశాడో తెలుసా?

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపడమేకాక, అతడి దేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో దాచి పెట్టిన దారుణ ఘటన న్యూఢిల్లీ నగరంలో వెలుగుచూసింది.

న్యూఢిల్లీ :తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపడమేకాక, అతడి దేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో దాచి పెట్టిన దారుణ ఘటన న్యూఢిల్లీ నగరంలో వెలుగుచూసింది.

ఓడిశా రాష్ట్రంలోని టాటా నగర్ కు చెందిన బాదల్ మండల్ ఢిల్లీలోని సైదులాజైబ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇతడి స్నేహితుడైన విపిన్ జోషి కూడా బాదల్ మండల్ పనిచేసే చోటే పనిచేస్తున్నాడు. పైగా ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

Man confesses to friend's murder over afair with wife

ఓ రోజు తన ఇంట్లోని బెడ్రూంలో తన భార్యతో స్నేహితుడైన విపిన్ జోషి అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని బాదల్ మండల్ చూశాడు. అంతే అతడిలోని రాక్షసుడు నిద్రలేచాడు. ముందుగా తన భార్యా పిల్లలను స్వస్థలమైన టాటానగర్ కు పంపించాడు బాదల్.

ఆ తరువాత స్నేహితుడైన విపిన్ జోషిని మందు పార్టీకి పిలిచాడు. జోషి తాగిన మైకంలో ఉండగా బాదల్ మండల్ అతడిపై కత్తితో దాడి చేసి పొడిచి చంపేశాడు. అనంతరం జోషి మృతదేహాన్ని ముక్కలుగా కోసం ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ప్రిజ్ లో దాచిపెట్టాడు.

ప్రిజ్ లో మనిషి మృతదేహం ముక్కలు వెలుగుచూడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. జోషి హత్యానంతరం బాదల్ మండల్ అదృశ్యం కావడంతో పోలీసులు అతడికోసం గాలింపు చేపట్టారు.

బాదల్ మండల్ తన పేరును సింగ్రాగా మార్చుకొని రూర్కెలాలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడని తేలడంతో పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు బాదల్ తన నేరాన్ని అంగీకరించాడని డీసీపీ చిన్మయ్ బిశ్వాల్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+