వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: స్కూటీపై దోశ.. ఎండ వేడితో రెడీ.. వీడియో వైరల్..

|
Google Oneindia TeluguNews

రుతు పవనాలు వచ్చినా.. వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. సో.. ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. రోహిణి కార్తె వెళ్లినా భానుడి విశ్వరూపం కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో ఎండ వేడిమికి సంబంధించి రకరకాల విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇదివరకే రోడ్డు మీద అమ్లేట్, దోశ వేయడం చూశాం. ఇప్పుడు మరింత కొత్తగా ఆలోచిస్తున్నారు. అలా దోశ వేసి.. వీడియో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దోశ.. అంటే సౌత్ ఇండియాలో ఫేమస్.. అందరికీ పరిచయమే.. నార్త్‌లో కూడా వాడతారు.. కానీ తక్కువ. అయితే హర్ష్ గొయంక షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఆయన బిజినెస్ టైకున్.. ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్.. అతన స్కూటీ మీద దోశ వేశాడు. ఎండతో దోశ అయ్యింది. గోధుమ రంగు కలర్ కూడా వచ్చింది. ఇంకేముంది దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తెగ వైర్ అవుతుంది.

Man Cooks Dosa On Seat Of Scooter As Temperature Soars

ఆ వీడియోను ఇప్పటికే 30 వేల సార్లు చూశారు. చాలా మంది చూసి.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వెస్పా దోశ డన్ బై ప్రొఫెషనల్స్ అని దానికి క్యాప్షన్ పెట్టారు. 40 డిగ్రీల వేడిలో దోశ తయారైంది అని చెప్పారు. ఆ దోశ గోధుమ రంగులోకి వచ్చింది. దోశకు సంబంధించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. శక్తి ఉత్పాదన ఇలా కూడా జరుగుతుందా అని ఒకరు కామెంట్ చేశారు. ఇంధనం ఆదా.. కార్బన్ అని మరొకరు అన్నారు. ప్రభుత్వానికి సాయం చేసి.. ద్రవ్యోల్బణం తగ్గించాలని.. ధరలు తగ్గించాలని మరొకరు అన్నారు.

ఢిల్లీలో భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. ఇటీవల వర్షం కురిసినా.. మళ్లీ ఎండ వేడిమికి కొనసాగుతోంది. ఆదివారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో 10వ తేదీ తర్వాత వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శనివారం 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

English summary
Harsh Goenka who is the chairman of RPG Enterprises shared the video with the caption, making dosa! at his scooty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X