మగబిడ్డను కనలేదని-ఏడాదిన్నరగా భార్య,కుమార్తెల నిర్భంధం-లైంగిక వేధింపులు,బలవంతపు అబార్షన్లు

మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. మగబిడ్డను కనలేదన్న కారణంతో ఓ భర్త తన భార్యను ఒక చిన్న గదిలో నిర్భంధించాడు. భార్యతో పాటు తన ముగ్గురు కుమార్తెలను ఏడాదిన్నరగా అదే గదిలో బంధించాడు. బలవంతంగా భార్యకు పలుమార్లు అబార్షన్ చేయించాడు. లైంగికంగా భార్యపై తీవ్ర వేధింపులకు పాల్పడ్డాడు. ఆ నరకం నుంచి ఎలా బయటపడాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఏడాదిన్నరగా ఆమె ఆ గదికే పరిమితమైంది. ఇటీవల తనను కాపాడాలంటూ ఒక నోట్ రాసి ఇంటి బయట విసిరేసింది. గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు ఆమెకు విముక్తి లభించింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పంధార్‌పూర్ పట్టణానికి చెందిన ఓ మహిళకు(41) దాదాపు 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారని భార్యపై భర్త కోపం పెంచుకున్నాడు. మగబిడ్డను కనలేదని ఆమెను తరుచూ వేధింపులకు గురిచేసేవాడు. ఇదే క్రమంలో ఏడాదిన్నర క్రితం ఆమెతో పాటు ముగ్గురు కుమార్తెలను ఇంట్లోనే ఒక చిన్న గదిలో నిర్భంధించాడు. అప్పటినుంచి ఆ గదికే పరిమితమై... అందులో నుంచి బయటపడలేక వారు నరకం అనుభవిస్తున్నారు.

బలవంతంగా అబార్షన్లు...

బలవంతంగా అబార్షన్లు...

గదిలో నిర్భంధించిన తర్వాత కూడా ఆమెపై వేధింపులు ఆగిపోలేదు. ఈ ఏడాదిన్నర కాలంలో భర్త ఆమెను చాలాసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. పలుమార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడు. తాను,తన ముగ్గురు పిల్లలు ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడాలని ఆమె భావించింది. ఈ క్రమంలో ఓరోజు తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను ఒక కాగితంపై రాసి ఇంటి బయట విసిరేసింది. రోడ్డున వెళ్తున్న ఓ యువతి ఆ చీటీని చదివి పరిస్థితిని అర్థం చేసుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

Recommended Video

    Who's Nitin Gadkari ? | Nitin Gadkari Remarkable Work For Roadways || Oneindia Telugu
    ఎట్టకేలకు విముక్తి

    ఎట్టకేలకు విముక్తి

    పోలీసులు రంగంలోకి దిగి వెంటనే ఆ ఇంటిపై దాడులు జరిపారు. ఆమె భర్తను అరెస్ట్ చేసి... నిర్బంధంలో ఉన్న అతని భార్యను,కుమార్తెలను విడిపించారు. ముగ్గురు కుమార్తెల వయసు 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు ఉంటుందని తెలిపారు. ఆ నలుగురిని ప్రభుత్వ ఆధీనంలోని సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆమె భర్తపై పోలీసులు అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+