ఇన్వెస్టర్ల దశ తిప్పిన స్టాక్.. రూ.లక్షకు రూ.7 లక్షలు
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం సులభంగా మారింది. కానీ లాభాలు గడించడం మాత్రం అంత తేలిక కాదు. మార్కెట్ పై పట్టున్న నిపుణుల సలహాలు తీసుకోవడంతోపాటు మనకు కూడా సొంతంగా అవగాహన ఉండాలి. సరైన స్టాక్ ను సరైన సమయంలో గుర్తించి పెట్టుబడి పెట్టడంతోపాటు ఓపికగా ఎదురు చూడాలి. అప్పుడే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందుతాయి. అలాంటి ఓ స్టాక్ మూడు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారుల దశను తిప్పేసింది. 720 శాతం మేర రిటర్న్స్ అందించి ఔరా అనిపించింది. ఆ స్టాక్ గురించి తెలుసుకుందాం.
పెట్టుబడిదారుల దశ తిప్పిన మల్టీబ్యాగర్ స్టాక్ మ్యాన్ ఇన్‌ఫ్రాకన్‌స్ట్రక్షన్స్.. ఈ కంపెనీ స్టాక్ కొనుగోలు చేసిన వారి దశ మారిపోయింది. మూడు సంవత్సరాల కాలంలోనే రూ.12గా ఉన్న స్టాక్ రూ.101.25కి చేరింది. ఏకంగా 720 శాతం రిటర్న్స్ అందించింది. మూడు సంవత్సరాల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినవారికి ఇప్పుడు వారి రూ.7.20 లక్షలపైన లాభం ఉంటుంది.

మ్యాన్ ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ అనుబంధ సంస్థ ఎంఐసీఎల్ క్రియేటర్స్ ఎల్ఎల్‌పీకి కొత్తగా 10 ప్రాజెక్టులు లభించాయి. అవి రాతిలాల్ బీ, మెహ్తా రోడ్, ఘట్కాపార్, ముంబై, మహారాష్ట్ర వంటివి ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో రూ.1,200 కోట్ల టర్నోవర్ నమోదు చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు బాగా రాణిస్తున్నాయి. 2020 జూన్ 12న రూ.12.30 వద్ద ఉండగా 2023 జూన్ 6కి రూ.101.25 వద్దకు చేరింది. ఈరోజు రూ.100.98 వద్ద ప్రారంభమవగా గరిష్ఠ స్థాయి రూ.102.17, కనిష్ఠ స్థాయి రూ.99.10 గా నమోదైంది












Click it and Unblock the Notifications